ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక వరదలు కొండచరియల విరుగుడు లాంటి భయంకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వర్షాల తీవ్రతతో పలు జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన కేదార్‌నాథ్ యాత్ర (Kedarnath Yatra)తీవ్ర అంతరాయానికి గురైంది. రుద్రప్రయాగలో శనివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో గౌరీకుండ్ నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ రహదారి మొత్తం బండరాళ్లతో మూసుకుపోయింది. దీంతో అధికారులు ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. దీంతో కేదార్‌నాథ్ యాత్రకు (Kedarnath Yatra)తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆ మార్గంలో రహదారిని క్లియర్ చేసే పనులు కొనసాగుతున్నాయి.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఈ వర్షం కారణంగా అగస్త్యమునిలోని బేడు బాగడ్ ప్రాంతంలో గల రమ్సీ వాగు పొంగిపొర్లుతోంది. దీంతో కేదార్‌నాథ్ (Kedarnath Yatra) హైవే సమీపంలోని అనేక ఇళ్లు, హోటళ్లు, పార్కింగ్ ప్రాంతాలు నీట మునిగాయి. అనేక వాహనాలు బురద నీటిలో కూరుకుపోయాయి. ఉత్తరకాశీలోని ఫూల్‌చట్టి సమీపంలో యమునోత్రి జాతీయ రహదారి దాదాపు 100 మీటర్ల పొడవున మునిగిపోయింది. మరోవైపు బాగేశ్వర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం కాప్కోట్ బ్లాక్‌లో 74 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కొండచరియలు విరిగిపడటం వల్ల ఈ ప్రాంతంలో తొమ్మిది రోడ్లు మూసుకుపోయాయి. రోడ్డు క్లియరెన్స్ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
కేదార్నాథ్ ప్రత్యేకత?
శివుని పవిత్ర నివాసం. కేదార్‌నాథ్ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం కాదు – ఇది విశ్వాసం మరియు స్థితిస్థాపకతకు నిదర్శనం . కురుక్షేత్ర యుద్ధం తర్వాత, పాండవులు తమ పాపాలకు శివుడిని క్షమాపణ కోరారని పురాణాలు చెబుతున్నాయి.
కేదార్నాథ్ శివలింగాన్ని తాకవచ్చా?
మధ్యాహ్నం 3 గంటల ముందు, భక్తులు శివలింగాన్ని తాకవచ్చు మరియు నెయ్యితో అభిషేకం చేయవచ్చు. సాయంత్రం 5 గంటల తర్వాత, విగ్రహాన్ని తాకడం నిషేధించబడింది, కానీ యాత్రికులు దూరం నుండి అధిష్టాన దేవతను చూడవచ్చు, అక్కడ అధిష్టాన దేవత విగ్రహం చక్రవర్తి వేషంలో ఉంటుంది.
కేదార్నాథ్ టెంపుల్ రహస్యం?
మహా యుద్ధం తర్వాత పాండవులు శివుని ఆశీర్వాదం పొందడానికి ప్రయత్నిస్తున్న ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించబడిందని నమ్ముతారు. వాటిని నివారించడానికి, శివుడు ఎద్దు రూపాన్ని తీసుకుని భూమిలోకి దూకాడని, ఆ మూపురం కేదార్‌నాథ్‌లో వ్యక్తమైందని చెబుతారు.
Read hindi news: hindi.vaartha.com