हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Karur stampede: తొక్కిసలాట ఘటనపై స్పందించిన చిరంజీవి

Anusha
Latest News: Karur stampede: తొక్కిసలాట ఘటనపై స్పందించిన చిరంజీవి

కరూర్ జిల్లాలో శనివారం రాత్రి జరిగిన దుర్ఘటన, తమిళనాడులో రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ తమిళ సినీ నటుడు విజయ్ (Vijay) నిర్వహించిన ప్రచార సభలో భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈ ఘటనా సమయంలో 39 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారికంగా ప్రకటించబడింది.

Arattai app: సోషల్ నెట్‌వర్కింగ్ విభాగంలో అరట్టై అగ్రస్థానం

మరింత బాధాకరం ఏమిటంటే, 50 మందికి పైగా మంది గాయపడి, కొందరు అత్యవసర ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నందున మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. 

వచ్చే ఏడాది తమిళనాడు లో శాసనసభ ఎన్నికలు

వచ్చే ఏడాది తమిళనాడు (Tamil Nadu) లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్ ఇప్పటి నుంచే ప్రజల్లోకి బలంగా వెళ్లాలని నిర్ణయించి ఈ నెల 13 నుంచి రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించారు. శనివారం నాడు నామక్కల్‌లో ఉదయం ప్రచారం చేపట్టిన విజయ్ సాయంత్రం కరూర్‌ చేరుకున్నారు.

అక్కడి వేలుసామిపురంలో రాత్రి ఏడున్నర గంటల గంటల సమయంలో ఆయన ప్రసంగిస్తుండగా తొక్కిసలాట చోటుచేసుకుంది.ఈ ఘటనపై ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. ఈ దుర్ఘటనపై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) స్పందిస్తూ భావోద్వేగంగా ట్వీట్ చేశారు. ‘

విచారణకు తమిళనాడు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు

తమిళనాడులోని కరూర్‌ (Karur) లో జరిగిన ర్యాలీలో జరిగిన దురదృష్టకరమైన తొక్కిసలాట ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ భరించలేని నష్టాన్ని అనుభవిస్తున్న కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. ఈ క్లిష్ట సమయంలో వారికి ధైర్యం కలగాలని కోరుకుంటున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’ అంటూ చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ దుర్ఘటనపై విచారణకు తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Govt) ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఆదివారం నాడు క్షతగాత్రులను పరామర్శించిన సీఎం స్టాలిన్ ఈ ఘటన వెనుక నిజానిజాలు త్వరలోనే బయటపడతాయని పేర్కొన్నారు.

విజయ్ సహాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు

తాను రాజకీయ ఉద్దేశంతో ఎలాంటి వ్యాఖ్యలు చేయనని, విచారణలో నిజాలు బయటకు వచ్చిన తర్వాత చట్టపరంగా ముందుకు వెళ్తామన్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు విజయ్ సహాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్, జాయింట్ సెక్రటరీ నిర్మల్‌ కుమార్‌పై ఎఫ్ఐఆర్‌ నమోదు చేసినట్లు లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ డేవిడ్‌సన్ తెలిపారు.ప్రచార సభకి కేవలం 10వేల మంది మాత్రమే హాజరవుతారని చెప్పిన టీవీకే పార్టీ (TVK party) ప్రతినిధులు అనుమతి తీసుకోగా.. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో లక్షల మంది ఉన్నారని తమిళనాడు డీజీపీ జి.వెంకట్రామన్ తెలిపారు.

అనుమతికి మించి ఎక్కువ మంది వస్తారన్న అంచనాతో పోలీసులు అదనపు భద్రతా ఏర్పాటు చేశారని, అయితే టీవీకే అధినేత విజయ్ షెడ్యూల్ టైమ్ కంటే చాలా ఆలస్యంగా రావడంతో గందరగోళం నెలకొందన్నారు. సంఘటన జరిగిన సమయంలో 2వేల మంది పోలీసులు అక్కడ విధుల్లో ఉన్నారని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870