బెంగళూరు: కర్ణాటకలో(Karnataka) ముఖ్యమంత్రి మార్పు గురించి పార్టీ అధిష్ఠానం మీకు చెప్పిందా? అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో, మీడియా ప్రతినిధులు ఈ విషయంపై ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
Read Also: Fire accident: పటాన్‌చెరులో రసాయన ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

మీడియాకు సీఎం సూచన
ఇలాంటి విషయాలపై కొందరు ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతుంటారని, వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సిద్ధరామయ్య అన్నారు. ఈ విషయంలో ప్రజల కంటే ఎక్కువగా మీడియానే ఆసక్తి చూపుతోందని ఆయన విమర్శించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ముఖ్య నేతలు సోనియా గాంధీ,(Sonia Gandhi) రాహుల్ గాంధీ ఈ విషయంపై ఏదైనా చెప్పినప్పుడే దాని గురించి మాట్లాడాలని ఆయన సూచించారు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అధిష్ఠానంతో చర్చిస్తామని సిద్ధరామయ్య తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి మార్పు గురించి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కె. శివకుమార్‌లు వేర్వేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో చర్చలు జరపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. డీకే శివకుమార్ నవంబర్ 11న ఢిల్లీలో పర్యటించనుండగా, సిద్ధరామయ్య 15వ తేదీన కాంగ్రెస్ నేతలను కలవనున్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: