కర్ణాటక రాష్ట్రం(Karnataka Crime) హుబ్బళ్లి నగరంలో కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో 13 ఏళ్ల బాలికపై 14–15 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది.
Read also: Tiruchanur: ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి

వీడియో తీసి బెదిరింపులు చేసినట్లు ఆరోపణలు
నిందితులు ఘటనను వీడియోగా చిత్రీకరించి బాలికను బెదిరించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపినట్లు తెలిపారు.
పోక్సో చట్టం కింద కేసు నమోదు
ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ముగ్గురు మైనర్లను(Karnataka Crime) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు విద్యార్థులు కాగా, మరోకరు చదువు మానేసిన వ్యక్తిగా గుర్తించారు. బాధితురాలికి అవసరమైన రక్షణ, సహాయం కల్పించామని పేర్కొన్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: