కర్ణాటకలో(Karnataka) సంచలనం రేపిన మంజు–లీల–సంతు ప్రేమ త్రిభుజం చివరికి ఊహించని మలుపు తిరిగింది. ప్రియుడు సంతు కోసం భర్త మంజునాథ్‌ను, ముగ్గురు పిల్లలను వదిలి వెళ్లిన లీల.. చివరికి తన నిర్ణయాన్ని మార్చుకుని కుటుంబం వద్దకు తిరిగి వచ్చింది. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీసింది.
Read Also: Kurnool Crime: ఇంగ్లీష్ రావడం లేదని బాలిక ఆత్మహత్య
భర్తను, పిల్లలను వదిలి వెళ్లిన లీల
బన్నేరుఘట్ట సమీపంలోని బసవనపుర ప్రాంతంలో ఈ ఘటన కొన్ని నెలల క్రితం తీవ్ర కలకలం రేపింది. భర్త మంజు, ముగ్గురు చిన్నారులను వదిలి లీల తన ప్రేమికుడు సంతుతో వెళ్లిపోవడం స్థానికంగా సంచలనంగా మారింది. భార్య దూరమవడంతో మంజు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. పిల్లల కోసమైనా ఇంటికి రావాలని మీడియా ముందే కన్నీళ్లతో వేడుకున్నాడు.
లీల, సంతు కలిసి ఉండటంపై మంజు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో జరిగిన గొడవలో మంజు దాడికి పాల్పడడంతో జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన పాత ఇంటిని వదిలి జల్లి మిషన్ ప్రాంతంలో కొత్తగా జీవితం మొదలుపెట్టాడు.
సోషల్ మీడియా ద్వారా ఆవేదన
భార్య, పిల్లల నుంచి దూరమైన(Karnataka) మంజు తన బాధను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా వెల్లడించాడు. ఆటో కొనుగోలు చేసి, తన పెద్ద కొడుకుతో కలిసి జీవిస్తూ జీవనోపాధి సాగించాడు. ఈ క్రమంలో లీల, సంతు పిల్లలను పాఠశాలకు పంపడం లేదని ఆరోపిస్తూ, వారిని తన సంరక్షణకు అప్పగించాలని బహిరంగంగా కోరాడు.
చివరికి కుటుంబం వైపు అడుగు
మంజు చేసిన ఆరోపణలు, భావోద్వేగ విజ్ఞప్తుల అనంతరం పరిస్థితి పూర్తిగా మారింది. నెలల తరబడి కొనసాగిన విభేదాలకు ముగింపు పలుకుతూ, లీల తన ముగ్గురు పిల్లలతో కలిసి భర్త మంజు వద్దకు తిరిగి వచ్చింది. ఈ పరిణామంతో మంజు–లీల–సంతు ప్రేమ త్రిభుజం కథ సుఖాంతం అయ్యింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: