కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి అధికార పీఠాన్ని కోల్పోయే ప్రమాదం తప్పదని తాజా సర్వేలు స్పష్టంగా సూచిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ మరియు కొడెమో టెక్నాలజీస్ సంయుక్తంగా నిర్వహించిన ‘పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్’ అనే సమగ్ర సర్వే నివేదికలో ఈ షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి.

బీజేపీకి జనాధార పెరుగుతోంది
సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ సర్వే తీవ్ర ప్రజా వ్యతిరేకతను బయటపెట్టింది. దీనికి విరుద్ధంగా, ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి ప్రజాదరణ గణనీయంగా పెరుగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నేటికి ఎన్నికలు జరిగితే బీజేపీ ఏకంగా 136-159 స్థానాలతో అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. కాంగ్రెస్ 62-82 స్థానాలకు పరిమితం కాగా, జేడీ(ఎస్) కేవలం 3-6 స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేసింది.
అవినీతి, హామీల విఫలత.. రాజకీయంగా నష్టమే
మహిళా సంక్షేమ పథకాలు భారీగా అమలు చేస్తున్నా, కాంగ్రెస్‌కు ఆశించిన ఆదరణ లభించడం లేదు. ముఖ్యంగా పురుష, యువ ఓటర్లలో, రైతులు, హిందూ సామాజిక వర్గాల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. పహల్గాం ఘటన, ఆపరేషన్ సింధుర్ వంటి పరిణామాలు కూడా బీజేపీకి అనుకూలంగా మారినట్లు సర్వే చెబుతోంది. గత 1985 నుండి కర్ణాటకలో ఏ అధికార పార్టీ కూడా తదుపరి ఎన్నికల్లో సొంతంగా సంపూర్ణ మెజారిటీ సాధించలేదనే చరిత్రను బట్టి చూస్తే, ప్రస్తుత ట్రెండ్ కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారడం ఆ పార్టీ అధిష్టానానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే, బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నప్పటికీ, మరోసారి అధికారంలోకి రావడానికి బలమైన వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది.
Read also: Operation Sindoor: మదర్సాలో ‘ఆపరేషన్ సిందూర్’ పాఠ్యాంశం