ఆ స్టూడెంట్ విద్యలో టాపర్. పదోతరగతిలో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచాడు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఎన్నో కలలు కన్నాడు. తల్లిదండ్రులు కూడా అందుకు సహకరించారు. కాలేజీ కూడా ఫీజు మినహాయింపు ఇచ్చింది. చక్కగా చదువుకునేందుకు చేయూతనిచ్చింది. తమ కుమారుడు ఉన్నతమైన చదువులు చదివి, తమను ఉద్దరిస్తారుకున్న ఆ కన్నవారికి కడుపుకోతే మిగిలింది. చదువులో టాపర్ కానీ ఏమైందో ఏమో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Read Also: Brazil: సింహాన్ని దగ్గర నుంచి చూడాలనుకున్నాడు.. ప్రాణాలనే కోల్పోయాడు
పట్టాలపై విగతజీవిగా పడిఉన్న కుమారుడు
ఉత్తరప్రదేశ్ లోని (Uttar Pradesh) కాన్పూర్ లో (Kanpur Crime) ఈ విషాద సంఘటన జరిగింది. శౌనక్ పాఠక్ (17) అనే విద్యార్థి 2023లో 10వ తరగతి బోర్డు పరీక్షలో 97.4శాతం మార్కులతో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో అతనికి కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో పూర్తి ఫీజు మినహాయింపు లభించింది. ప్రస్తుతం బ్రిజ్ కిషోర్ దేవి మెమోరియల్ ఇంటర్ కాలేజీలో విద్యను అభ్యసిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ-బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ సోమవారం ఉదయం కాలేజీకి అని వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తండ్రి అలోక్ పాఠక్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ఉదయం 6.30 గంటల ప్రాంతంలో బైక్ పై కాలేజీకి వెళ్లి తిరిగి రాలేదని చెప్పాడు. పదేపదే ఫోన్ చేసినా సమాధానం రాకపోవడంతో సోదరి మినీ, తండ్రి వెదకడం ప్రారంభించారు. కొన్ని గంటల తర్వాత జూహి రైల్వే యార్డ్ సమీపంలో శవమై కనిపించాడు. పట్టాల పక్కన రౌనక్ విగతజీవిగా పడి ఉన్నాడు. తన కొడుకు చాలా తెలివైన వాడని.. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలియదని కన్నీరుమున్నీరుగా విలపించాడు.
పోలీసులు కేసును నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అతని మొబైల్ డేటాను పరిశీలిస్తున్నామని.. స్నేహితులను కూడా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పిల్లలపై చదువు ఒత్తిడి పెరిగిపోతున్నది. అలాగని దాన్ని అధిగమించేందుకు ప్రయత్నించాలే తప్ప ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకూడదని మానసిక నిపుణులు అంటున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: