బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana ) మరోసారి తన సోషల్ మీడియా పోస్ట్‌తో వార్తల్లోకెక్కారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) , యాపిల్ సంస్థను భారత్‌లో తయారీ కేంద్రాలు ప్రారంభించవద్దని కోరిన అంశంపై కంగనా స్పందిస్తూ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ట్రంప్ వ్యాఖ్యలపై ఆమె చేసిన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ఆ ట్వీట్ BJP అధిష్ఠానం దృష్టికి వెళ్లడంతో, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా కంగనాకు ఫోన్ చేసి ట్వీట్ తొలగించాలనన్నారు.
ట్వీట్ ను తొలగించిన కంగనా
జేపీ నడ్డా సూచన మేరకు కంగనా వెంటనే తన ట్వీట్‌ను తొలగించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. “ట్రంప్ వ్యాఖ్యలపై నా వ్యక్తిగత అభిప్రాయం వెల్లడించాను. అయితే గౌరవనీయులు జేపీ నడ్డా గారు నాకు ఫోన్ చేసి ఆ పోస్టు తొలగించమని చెప్పడంతో వెంటనే తీసేశాను. ఇన్‌స్టాగ్రామ్ నుంచీ తొలగించాను. ఈ క్షణిక భావోద్వేగానికి మించిన దేమీ కాదు” అంటూ మరో ట్వీట్‌లో ఆమె పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలో అతిపెద్ద ఆదరణ కలిగిన వ్యక్తి
కంగనా తొలగించిన పోస్టులో, ట్రంప్ వ్యాఖ్యల వెనుక అసలు కారణాలపై ఆమె కొన్ని అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. ఆమె రాసిన ట్వీట్‌లో ప్రధాని నరేంద్ర మోదీని ప్రపంచంలో అతిపెద్ద ఆదరణ కలిగిన నేతగా పొగడ్తలతో ముంచెత్తారు. ట్రంప్ ఆల్ఫా మేల్ అయినా, మోదీ ఆల్ఫాల ఆల్‌ఫా అని వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్‌కు వ్యక్తిగత అసూయేనా? లేక దౌత్య పరంగా ఆత్మవిశ్వాస లోపమా? అంటూ ప్రశ్నించారు. కంగనా ఈ వ్యాఖ్యలు తొలగించినప్పటికీ, సోషల్ మీడియాలో ఇప్పటికీ విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Read Also : Trinamool Congress : తృణమూల్లో చేరిన బీజేపీ మాజీ కేంద్ర మంత్రి