ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ (Kamal Haasan) పై తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై (Annamalai) తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రోజునుంచే ప్రజల కోసం, మార్పు కోసం పనిచేస్తానని చెప్పినా, చివరికి ఆయన స్వార్థ రాజకీయాల్లో మునిగిపోయారని అన్నామలై మండిపడ్డారు.
Crime: ప్రియురాలిని హతమార్చి ..ఆపై సమాధిపైనే నిద్ర
“ఒకే ఒక్క రాజ్యసభ (Rajya Sabha) సీటు కోసం కమల్ తన ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నాడు. ప్రజలు ఆయనను ఒక ఆలోచనాపరుడిగా గౌరవించారు. కానీ ఇప్పుడు ఆయన అధికార డీఎంకే పార్టీకి మద్దతుగా నిలబడటం, తన విలువలను తానే తుడిచిపెట్టుకోవడమే” అని అన్నారు.
కరూర్ తొక్కిసలాట ఘటనలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.గత నెల 27న కరూర్ పట్టణంలో నటుడు విజయ్ (Vijay) నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

డీఎంకే (DMK) నేతలతో కలిసి బాధితులను పరామర్శించారు
ఈ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఈ ఘటన అనంతరం కమల్ హాసన్ స్థానిక డీఎంకే (DMK) నేతలతో కలిసి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది దురదృష్టకరమైన ఘటన అయినప్పటికీ, ప్రభుత్వ వైఫల్యం కాదని అన్నారు.
పోలీసులు తమ విధిని సక్రమంగా నిర్వర్తించారని, ముఖ్యమంత్రి కూడా గౌరవంగా వ్యవహరించారని కితాబిచ్చారు.కమల్ చేసిన ఈ వ్యాఖ్యలపై అన్నామలై తీవ్రంగా స్పందించారు. “ఒక రాజ్యసభ సీటు కోసం కమల్ ఎప్పుడో తన అంతరాత్మను అమ్ముకున్నారు.
కరూర్ (Karur) బాధితులను పరామర్శించడానికి వెళ్లి, ప్రభుత్వ తప్పులేదని సర్టిఫికేట్ ఇవ్వడాన్ని ఎవరైనా అంగీకరిస్తారా? ఆయన ఇంతగా దిగజారాల్సిన అవసరం ఏముంది?” అని అన్నామలై (Annamalai) ప్రశ్నించారు. అసలు కమల్ మాటలను తమిళనాడు ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని ఆయన ఎద్దేవా చేశారు. కమల్ పూర్తిగా డీఎంకేకు అనుకూలంగా మారిపోయారని అన్నామలై విమర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: