రూ.400 కోట్ల విలువైన ఆస్తులపై నిషేధం
ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ముగ్గురు కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టు ఇంజినీర్లపై విజిలెన్స్ శాఖ కఠిన చర్యలు తీసుకుంది. వీరికి చెందిన ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ ఆస్తుల విలువ మార్కెట్‌లో దాదాపు రూ.400 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కోర్టులో కేసు తేలేంతవరకు ఈ ఆస్తులపై ఎలాంటి లావాదేవీలు జరపకూడదని అధికారుల ఆదేశాలు వచ్చాయి. ఏసీబీ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా నోటిఫికేషన్ జారీ చేశారు.
Read also: స్వల్పంగా తగ్గిన టోకు ద్రవ్యోల్బణం..
భూక్యా హరిరాం, నూనె శ్రీధర్, చీటి మురళీధర్‌పై కేసులు
ఏసీబీ దాడుల్లో బయటపడిన వివరాల ప్రకారం, గజ్వేల్ ఈఎన్సీ భూక్యా హరిరాం, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్, మరియు మాజీ చీఫ్ ఇంజినీర్ చీటి మురళీధర్ పెద్దఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారని తేలింది. హరిరాం 2025 మేలో అరెస్టయ్యారు, ఆ సమయంలో ఆయన కాళేశ్వరం (Kaleswaram)ఇరిగేషన్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు. శ్రీధర్ కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో కలిసి దాదాపు రూ.110 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చీటి మురళీధర్ ఆస్తుల విలువ రూ.100 కోట్లు దాటిందని అంచనా.
ఏసీబీ లేఖతో విజిలెన్స్ కదిలింది
ఏసీబీ అధికారులు సేకరించిన ఆధారాలతో విజిలెన్స్ కమిషన్ సత్వర చర్యలు తీసుకుంది. ఏసీబీ డైరెక్టర్ పంపిన లేఖ ఆధారంగా ఈ ముగ్గురి ఆస్తులను అధికారికంగా అటాచ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆస్తులపై ఎలాంటి క్రయవిక్రయాలు జరగకుండా విజిలెన్స్ శాఖ పర్యవేక్షణలో ఉంచబడింది. ఈ కేసులు కోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని సాక్ష్యాలు సేకరిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: