నాలుగు నెలల గర్భిణీ అయిన ఢిల్లీ స్వాట్ కమాండో కాజల్ చౌదరి (Kajal Chaudhary) హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. భర్త అంకుర్, డంబెల్ తో, ఆమెను దారుణంగా హత్య చేసాడు. ఈ కేసులో వెలుగులోకి కొత్త విషయాలు వస్తున్నాయి. హత్యకు ముందు ఆమె సోదరుడు నిఖిల్‌కి కాల్ చేసి ‘మీ అక్కను చంపుతున్నా.. ఇది రికార్డ్ చేసి పెట్టుకో పోలీసుల ఇన్వెస్టిగేషన్‌కు పనికొస్తుంది’ అని చెప్పాడు. కాసేపటికి ఫోన్ చేసి మీ అక్క చనిపోయిందని తెలిపాడు. కాగా కాజల్ (Kajal Chaudhary) అత్త, ఆడపడుచులు కట్నం కోసం వేధించేవారని నిఖిల్ ఆరోపించారు. అంకుర్‌ను పోలీసులు రిమాండ్‌కు పంపారు.
Read Also: Operation Pacific: లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: