జమ్మూ కశ్మీర్: జమ్మూ కశ్మీర్‌లో(Jammu and Kashmir) భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. కిష్తివాడ్ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
Read Also: Ranga Reddy: రంగారెడ్డి జిల్లాకు దేశంలోనే మొదటి ధనిక స్థానం

ఆపరేషన్ ఛత్రు’ ప్రారంభం
ప్రస్తుతం ఈ ప్రాంతంలో భారత సైన్యం ‘ఆపరేషన్ ఛత్రు’ను నిర్వహిస్తోంది. భారత సైన్యంలోని వైట్ నైట్ కార్ప్స్ మరియు కశ్మీర్ పోలీసుల సంయుక్త బృందాలు తెల్లవారుజామున సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.
ఎదురుకాల్పులు, దర్యాప్తు
ఉగ్రవాదులు(Terrorists) దాక్కున్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టిన క్రమంలో, సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: