हिन्दी | Epaper

జమ్ము కశ్మీర్ మిస్టరీ మరణాలకు కారణాలు: కేంద్రమంత్రి

Vanipushpa
జమ్ము కశ్మీర్ మిస్టరీ మరణాలకు కారణాలు: కేంద్రమంత్రి

జమ్ము కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని బుధాల్ గ్రామంలో అంతుచిక్కని మరణాలు సంభవిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నెలన్నర రోజుల వ్యవధిలోనే మొత్తంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మరణాలకు కారణం ఏంటో తెలుసుకునేందుకు అటు రాష్ట్ర ఆరోగ్యశాఖతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి కారణాలను కనుక్కోలేకపోయింది. అయితే తాజాగా దీనిపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. రాజౌరీ మిస్టరీ మరణాల వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించారు. రాజౌరీ జిల్లాలోని బుధాల్ గ్రామంలో గతేడాది డిసెంబర్ నెల 7వ తేదీన ఓ కుటుంబం సహపంక్తి భోజనాలు చేసింది. అయితే తిన్న వెంటనే ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇది జరిగిన మరో 5 రోజులకే రెండో సంఘటన చోటు చేసుకుంది. డిసెంబర్ 12వ తేదీ రోజు మరో కుటుంబం సహపంక్తి భోజనాలు చేయగా.. తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో ముగ్గురు చనిపోగా.. ఆరుగురు చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటన జరిగిన మరో నెల రోజులకు అంటే జనవరి 12వ తేదీన మరో కుటుంబంలోనూ ఇలాంటిదే జరిగింది. సహపంక్తి భోజనం చేయగా.. మొత్తం పది మంత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇలా 45 రోజుల వ్యవధిలోనే మొత్తంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటినీ గుర్తించిన రాష్ట్ర సర్కారు రంగంలోకి దిగి.. బాధితుల నుంచి నమూనాలను సేకరించి దేశంలోని అనేక ల్యాబ్‌లకు పంపించింది. అలాగే బాధితుల్లో కొన్ని విషపూరిత పదార్థాలను గుర్తించామన్నారు. అయితే ఎవరైనా కావాలనే ఈ మూడు కుటుంబాలు తిన్న ఆహార పదార్థాల్లో విషం కలిపి ఉంటే తామస్సలే ఊరుకోమని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

No image

దేశంలో ఇంధన సంక్షోభం ముంచుకొస్తోందని – రాహుల్ గాంధీ హెచ్చరించారు.

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

📢 For Advertisement Booking: 98481 12870