हिन्दी | Epaper

Isro -LVM3-M5 Rocket : నేడు ఇస్రో ‘బాహుబలి’ ప్రయోగం

Sudheer
Isro -LVM3-M5 Rocket : నేడు ఇస్రో ‘బాహుబలి’ ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. దేశంలోనే అత్యంత బరువైన ఉపగ్రహం CMS-03 (కమ్యూనికేషన్ శాటిలైట్)ను ఈ రోజు సాయంత్రం 5.26 గంటలకు నింగిలోకి పంపేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. సుమారు 4,410 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని “బాహుబలి రాకెట్”గా పేరుగాంచిన LVM3-M5 ద్వారా ప్రయోగించనున్నారు. ఇది శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి జరగనుంది. ప్రయోగం ప్రారంభమైన 16.09 నిమిషాల తర్వాత ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించనుందని ఇస్రో తెలిపింది. ఈ ప్రయోగం విజయవంతమైతే, భారత్ అంతరిక్ష సాంకేతిక రంగంలో మరో విశిష్ట ఘట్టాన్ని సృష్టించినట్లవుతుంది.

Latest News: Chrome: గూగుల్ క్రోమ్ పాత వెర్షన్ యూజర్లకు సర్ట్-ఇన్ హెచ్చరిక

CMS-3 ఉపగ్రహం ప్రధానంగా సైనిక మరియు వ్యూహాత్మక సమాచార వ్యవస్థలను బలోపేతం చేయడానికి రూపొందించబడింది. ఇది పూర్తి స్థాయిలో స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయబడిన కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఈ శాటిలైట్ ద్వారా రక్షణ దళాలకు సురక్షితమైన కమ్యూనికేషన్ లింకులు, అధునాతన డేటా ట్రాన్స్‌మిషన్ సదుపాయాలు అందించబడతాయి. అంతేకాకుండా, ఈ ఉపగ్రహం ద్వారా విపత్తు నిర్వహణ, సముద్ర పర్యవేక్షణ, ఉపగ్రహ ఆధారిత నెట్‌వర్క్ వ్యవస్థలకు కూడా సాయపడనుంది. CMS సిరీస్ ఉపగ్రహాలు ఇప్పటికే భారత సైన్యానికి కీలక సమాచారాన్ని అందిస్తున్న నేపథ్యంలో, CMS-3 వాటిలో అత్యంత శక్తివంతమైనదిగా గుర్తింపు పొందనుంది.

ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం కోసం గత కొద్దిరోజులుగా తీవ్రంగా కృషి చేశారు. రాకెట్ అసెంబ్లీ, ఇంధనం నింపడం, ఫైనల్ సిస్టమ్ చెక్స్ అన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ప్రయోగం ద్వారా భారత అంతరిక్ష పరిశోధనలో కొత్త మైలురాయి చేరుకోనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంత బరువైన ఉపగ్రహాన్ని దేశీయ సాంకేతికతతో అంతరిక్షంలోకి పంపడం భారత ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం అని చెబుతున్నారు. ఈ మిషన్ విజయవంతమైతే, ఇస్రో భవిష్యత్‌ లో మరింత భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను, అంతరిక్ష రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయగల సత్తా ఉందని ఇది నిరూపించనుంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మోదీ సర్కార్ డబుల్ ధమాకా, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

మోదీ సర్కార్ డబుల్ ధమాకా, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

వంటగ్యాస్ ఆందోళనపై మోదీ సమీక్ష, ఉత్పత్తి పెంపు ఆదేశాలు

వంటగ్యాస్ ఆందోళనపై మోదీ సమీక్ష, ఉత్పత్తి పెంపు ఆదేశాలు

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

📢 For Advertisement Booking: 98481 12870