हिन्दी | Epaper

ISRO YUVIKA 2026: 9వ తరగతి విద్యార్థులకు యువ శాస్త్రవేత్తల కార్యక్రమం

Pooja
ISRO YUVIKA 2026: 9వ తరగతి విద్యార్థులకు యువ శాస్త్రవేత్తల కార్యక్రమం

ISRO YUVIKA 2026: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ‘యువిక 2026 – యువ శాస్త్రవేత్తల కార్యక్రమ్’ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సైన్స్‌తో పాటు అంతరిక్ష సాంకేతికత, దాని అనువర్తనాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అభ్యర్థులను ఆన్‌లైన్ క్విజ్ ద్వారా పరీక్షించనున్నారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 31, 2026 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. 2026 జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతున్న భారతీయ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Read Also:National Medical Commission: TG, APలకు సూపర్ స్పెషాలిటీ సీట్లు పెంపు

ISRO YUVIKA 2026
ISRO YUVIKA 2026: Young Scientist Program for Class 9 Students

ఎంపిక విధానం & వెయిటేజీ వివరాలు

యువికా ఎంపికలో వివిధ అంశాలకు వెయిటేజీ కేటాయించారు.

  • 8వ తరగతి వార్షిక పరీక్ష మార్కులకు 50% వెయిటేజీ
  • ఆన్‌లైన్ క్విజ్ పనితీరు – 10%
  • సైన్స్ ఫెయిర్లు, సహ-పాఠ్య కార్యక్రమాల్లో పాల్గొనడం – 2% నుంచి 10%
  • ఒలింపియాడ్‌లు, క్రీడలు, NCC/NSS, స్కౌట్స్ & గైడ్స్‌లో పాల్గొన్న వారికి అదనపు మార్కులు
  • గ్రామీణ/పంచాయతీ పాఠశాల విద్యార్థులకు 15% ప్రత్యేక వెయిటేజీ

ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి కనీస ప్రాతినిధ్యం ఉండేలా ISRO అవకాశం కల్పిస్తుంది. STEM రంగాల్లో కెరీర్ చేయాలనుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు.

ISRO యువిక 2026 ముఖ్యమైన తేదీలు

  • రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 27, 2026
  • రిజిస్ట్రేషన్ ముగింపు: మార్చి 31, 2026
  • మొదటి ఎంపిక జాబితా: ఏప్రిల్ 13, 2026
  • రెండవ నిర్ధారణ జాబితా: ఏప్రిల్ 20, 2026
  • యువిక కార్యక్రమం: మే 11 నుంచి 22, 2026

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870