हिन्दी | Epaper

IRCTC: రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవ తో  సీటు వద్దకే ఆహారం

Saritha
IRCTC: రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవ తో  సీటు వద్దకే ఆహారం

భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి ‘ఈ-ప్యాంట్రీ’ సేవను ప్రారంభించింది. ఈ-ప్యాంట్రీ సేవ ప్రారంభంతో ప్రయాణికులకు రైళ్లలో ఆహార నాణ్యతపై ఉన్న ఆందోళనలు గణనీయంగా తగ్గనున్నాయని భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ముందస్తు ఆర్డర్ విధానం ద్వారా భోజనం సరైన సమయానికి, శుభ్రత ప్రమాణాలను పాటిస్తూ సరఫరా చేయడం సాధ్యమవుతుందని చెప్పారు. ప్రయాణికులు తమ ప్రయాణ తేదీకి ముందు లేదా ప్రయాణ సమయంలోనూ ఆహారాన్ని బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Read Also: DA Hike: కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్: హోలీ కానుకగా 2% డీఏ పెంపు..

IRCTC: రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవ తో  సీటు వద్దకే ఆహారం

బర్త్‌ దగ్గరకే శుభ్రమైన, వేడి ఆహారం

ఈ సేవ ద్వారా ప్రయాణికులు తమ సీట్లను వదిలి వెళ్లే అవసరం లేకుండానే, తమ బర్త్‌ దగ్గరకే శుభ్రమైన, వేడి ఆహారం (Food), ప్యాకేజ్డ్ వాటర్‌ను ముందుగానే బుక్ చేసుకుని పొందవచ్చు. గతంలో ప్రీమియం రైళ్లకు మాత్రమే పరిమితమైన ఈ సేవను ఇప్పుడు 25 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విస్తరించారు. భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ధృవీకరించబడిన, RAC టిక్కెట్లు ఉన్న ప్రయాణికులు భోజనాన్ని ఆర్డర్ చేయవచ్చు. రానున్న రోజుల్లో మరిన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఈ-ప్యాంట్రీ సేవను విస్తరించే యోచనలో ఉన్నట్లు భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ వెల్లడించింది. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా మెనూలు, సేవలను మరింత మెరుగుపర్చే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

📢 For Advertisement Booking: 98481 12870