Karnataka Tour from Hyderabad: కొత్త సంవత్సరానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉండటంతో పర్యటనలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, న్యూ ఇయర్‌ను ఆనందంగా ప్రారంభించాలనుకునే ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఆకర్షణీయమైన బడ్జెట్ టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రాంతాలు, పర్యాటక కేంద్రాలను సందర్శించేలా ఈ ప్రత్యేక ట్రిప్‌ను రూపొందించింది.
Read also: Kedarnath: కేదార్‌నాథ్ ఆలయానికి ఆరు నెలల బ్రేక్..
మురుడేశ్వర్–ఉడిపి–శృంగేరి
మొత్తం ఆరు రోజుల పాటు సాగే ఈ టూర్‌లో మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరి వంటి ప్రసిద్ధ ప్రాంతాలతో పాటు అందమైన సముద్ర తీరాలను కూడా సందర్శించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దేవాలయ దర్శనాలు, ప్రకృతి అందాలు ఇష్టపడే వారికి ఈ ప్యాకేజీ అనువుగా ఉంటుంది.

ఈ ప్రత్యేక టూర్ జనవరి 6, 2026 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి రోజు ఉదయం 6:05 గంటలకు హైదరాబాద్ కాచిగూడ స్టేషన్ నుంచి మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్(Mangalore Central Express) (12789) రైలు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం అనంతరం రెండో రోజు ఉదయం మంగళూరు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉడిపికి వెళ్లి శ్రీకృష్ణ ఆలయం, మాల్పే బీచ్‌ను సందర్శిస్తారు. రాత్రి ఉడిపిలోనే బస ఏర్పాటు ఉంటుంది.
6 రోజుల కర్ణాటక దేవాలయాల టూర్
మూడో రోజు కొల్లూరు మూకాంబిక ఆలయ దర్శనం అనంతరం మురుడేశ్వర్ వెళ్లి ప్రపంచ ప్రఖ్యాత శివుడి విగ్రహం, బీచ్‌ను సందర్శిస్తారు. నాలుగో రోజు హోర్నాడు అన్నపూర్ణ ఆలయం, శృంగేరి శారదాంబ ఆలయ దర్శనాలు పూర్తిచేసుకుని మంగళూరుకు చేరుకుంటారు. ఐదో రోజు మంగళాదేవి, కద్రి మంజునాథ, కుండ్రోలి గోకర్నాథ ఆలయాలతో పాటు తన్నీర్భవి బీచ్‌ను చూసి తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆరో రోజు రాత్రి కాచిగూడ చేరుకోవడంతో ప్యాకేజీ ముగుస్తుంది.
ధరల విషయానికి వస్తే, స్లీపర్ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.19,000 నుంచి ప్రారంభమవుతుంది. డబుల్ షేరింగ్ రూ.23,670 కాగా, సింగిల్ షేరింగ్ రూ.41,630 వరకు ఉంటుంది. 3A కంపార్ట్మెంట్‌లో ట్రిపుల్ షేరింగ్ రూ.15,970, డబుల్ షేరింగ్ రూ.20,650, సింగిల్ షేరింగ్ రూ.38,600గా నిర్ణయించారు. పిల్లల కోసం ప్రత్యేక రేట్లు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం IRCTC టూరిజం వెబ్‌సైట్‌ను లేదా ఇచ్చిన ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: