స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త. (IQ) ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఐకూ (iQOO) తమ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఐకూ క్వెస్ట్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా వివిధ ఐకూ స్మార్ట్‌ఫోన్‌లను భారీ డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. ఈ సేల్ డిసెంబర్ 19వ తేదీ వరకు కొనసాగనున్నట్లు కంపెనీ వెల్లడించింది. బడ్జెట్ ఫోన్‌ల నుంచి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మోడళ్ల వరకు ఈ సేల్‌లో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.ఈ క్వెస్ట్ డేస్ సేల్‌లో భాగంగా రూ.10,999 ప్రారంభ ధర నుంచే ఐకూ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి, లేదా పాత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉండే అవకాశముంది. ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ : IQ ప్రత్యేక సేల్ లో భాగంగా ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌పై (iQOO 15 Smartphone) రూ.4 వేల డిస్కౌంట్ ను పొందవచ్చు. ఫలితంగా రూ.68999 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ 2K M14 OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 ప్రాసెసర్ తో పనిచేస్తోంది.
Read also: Smart Phones: వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

iQOO కొత్త స్మార్ట్‌ఫోన్లు: ధరలు, ఫీచర్లు, EMI ఆప్షన్‌లు
IQ నియో 10 స్మార్ట్‌ఫోన్ : ఈ స్మార్ట్‌ఫోన్ ను రూ.34999 (iQOO Neo 10 Smartphone) ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ను గరిష్ఠంగా 6 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్‌ను అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్ పైన పనిచేస్తోంది. * ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్ : IQ నియో 10R స్మార్ట్‌ఫోన్ (iQOO Neo 10R Smartphone) ధర రూ.24999 గా ఉంది. గరిష్టంగా 6 నెలల వరకు నో కాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్ పైన పనిచేస్తుంది. IQ Z10x స్మార్ట్‌ఫోన్ ను (iQOO Z10x 5G Smartphone) రూ.13,749 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఏకంగా 6500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ ను (iQOO Z10R Smartphone) రూ.18999 కే సొంతం చేసుకోవచ్చు.
గరిష్ఠంగా 6 నెలల వరకు నో కాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే, సోనీ IMX882 OIS కెమెరాను కలిగి ఉంది.iQ Z10 స్మార్ట్‌ఫోన్ : IQ Z10 స్మార్ట్‌ఫోన్ (iQOO Z10 Smartphone) ఏకంగా 7300mAh బ్యాటరీతో పనిచేస్తోంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ను బ్యాంకు కార్డులతో రూ.20999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు గరిష్ఠంగా 6 నెలల వరకు EMI ఆప్షన్ లు ఉన్నాయి. * ఐకూ Z10 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ : IQ Z10 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ పై (iQOO Z10 Lite 5G Smartphone) రూ.1000 బ్యాంకు డిస్కౌంట్ ను పొందవచ్చు. ఫలితంగా రూ.10999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు IQ TWS 1e ఇయర్‌బడ్స్ ను రూ.1899 కే కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్టును కలిగి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: