Induction stove : టాటా గ్రూప్‌కు చెందిన క్రోమా రిటైల్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, ఇటీవల ఇండక్షన్ కుక్‌టాప్‌ల విక్రయాలు మూడు రెట్లు పెరిగినట్లు వెల్లడించారు.
అలాగే పిజియన్, గిల్మా వంటి బ్రాండ్లను విక్రయించే స్టవ్‌క్రాఫ్ట్ లిమిటెడ్ కంపెనీ కూడా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మొదలైన తర్వాత తమ ఆన్‌లైన్ అమ్మకాలు నాలుగు రెట్లు పెరిగాయని తెలిపింది.
గ్యాస్ భయంతో ముందస్తు కొనుగోళ్లు
గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారనే వార్తలతో చాలా కుటుంబాలు ముందస్తుగా ఇండక్షన్ స్టవ్‌లను కొనుగోలు చేస్తున్నాయి. భవిష్యత్తులో గ్యాస్ అందుబాటులో సమస్యలు రావచ్చనే భయంతో ఈ కొనుగోళ్లు పెరిగినట్లు తెలుస్తోంది.
Read Also: LPG Shortage: ట్రైన్లలో భోజనాలు బంద్?.. IRCTC నిర్ణయం!

ప్రభుత్వం స్పష్టీకరణ
ఇక కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదని స్పష్టం చేసింది. బుకింగ్ చేసిన 2.5 రోజుల్లోనే సిలిండర్లు డెలివరీ అవుతున్నాయని అధికారులు తెలిపారు.
పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రకారం దేశానికి అవసరమైన ముడి చమురులో సుమారు 70 శాతం హార్ముజ్ జలసంధి వెలుపలి మార్గాల ద్వారా వస్తుందని పేర్కొన్నారు. అలాగే ఎల్పీజీ ఉత్పత్తిని కూడా 25 శాతం వరకు పెంచినట్లు తెలిపారు.
అయితే అధికారుల హామీలు ఉన్నప్పటికీ వినియోగదారుల్లో ఆందోళన కొనసాగుతుండడంతో ఇండక్షన్ స్టవ్‌ల డిమాండ్ మాత్రం తగ్గడం లేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: