Indore deaths diarrhoea : మధ్యప్రదేశ్‌లోని Indore నగరంలోని భాగీరథ్‌పురా ప్రాంతంలో కలుషిత తాగునీటి కారణంగా సంభవించిన మరణాలపై జరుగుతున్న విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం, తాగునీటి నమూనాల్లో సాధారణంగా మురుగు నీటిలో కనిపించే ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు కనీసం 9 మంది మృతి చెందగా, వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
డిసెంబర్ 25 నుంచి స్థానికులు నీటిలో దుర్వాసన వస్తోందని ఫిర్యాదులు చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న బాధితుల సంఖ్య వేగంగా పెరిగింది. ఇప్పటివరకు 2,400 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారని, వారిలో 160 మందికిపైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైద్య శాఖ వెల్లడించింది.
Read also: Virat Kohli: న్యూ ఇయర్.. కొత్త ఫొటోను షేర్ చేసిన క్రికెటర్
విచారణ కమిటీ చైర్మన్‌గా ఉన్న అదనపు ప్రధాన కార్యదర్శి (Indore deaths diarrhoea) సంజయ్ దూబే మాట్లాడుతూ, మొత్తం 14 మరణాలు నమోదైనా, వాటిలో 9 మరణాలు డయేరియా కారణంగానే జరిగినట్లు స్పష్టం చేశారు. మిగతా మరణాలు ఇతర ఆరోగ్య సమస్యలు లేదా ప్రమాదాల వల్ల జరిగాయని తెలిపారు. కలుషిత నీటి సరఫరాకు కారణం పాత మురుగు పైప్‌లైన్ నుంచి తాగునీటి పైప్‌లైన్‌లో లీకేజీ కావడమేనని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై National Human Rights Commission (NHRC) సుమోటోగా స్పందించి, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బాధితుల మానవ హక్కులు ఉల్లంఘించబడ్డాయంటూ రెండు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: