Ram Mohan Naidu: దేశవ్యాప్తంగా లక్షలాది విమాన ప్రయాణికులను ఇబ్బందుల్లోకి నెట్టిన ఇండిగో(Indigo) విమానాల అంతరాయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) స్పందించారు. ఈ సమస్య ప్రభుత్వ నిబంధనల వలన కాకుండా పూర్తిగా ఇండిగో సంస్థలోని అంతర్గత లోపాల ఫలితమని ఆయన స్పష్టంచేశారు. శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
Read Also: IndiGo Flight Disruptions : ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో

ప్రయాణికుల ఇబ్బందులకు కారణం ఇండిగో ప్లానింగ్ వైఫల్యమే
“ఇండిగో(Indigo)లో ఏర్పడిన పరిస్థితిని ప్రభుత్వం తేలికగా తీసుకోదు. మేము నిరంతరం స్థితిగతులను సమీక్షిస్తున్నాం. ఈ అంతరాయానికి కారణం సంస్థలోని రోస్టరింగ్‌లో, అంతర్గత మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో ఉన్న సమస్యలే. ఇటీవల అమలు చేసిన క్రూ వర్క్ అవర్స్ నిబంధనలతో దీనికి ఎలాంటి సంబంధం లేదు” అని మంత్రి స్పష్టం చేశారు. అన్ని భాగస్వాములతో చర్చించిన తర్వాతే కొత్త నిబంధనలను రూపొందించామని, డిసెంబర్ 3 వరకు విమానాల పాలన సాధారణంగానే సాగిందని గుర్తుచేశారు.
రోస్టరింగ్ సమస్యలే మూలం
ప్రయాణికులు ఎదుర్కొన్న అసౌకర్యంపై విచారం వ్యక్తం చేసిన మంత్రి, టికెట్ ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ప్రభుత్వం పరిమితులు విధించిందని, ధరలపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని చెప్పారు.
అయితే ఈ వివరణపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని దాచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ రాజ్యసభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: