దేశీయ విమానయాన సంస్థ ఇండిగో లో పైలట్ల కొరత, ప్రణాళికా లోపాల కారణంగా తలెత్తిన సంక్షోభం వరుసగా ఐదో రోజుకు చేరుకుంది. వందలాది విమానాలు రద్దు కావడంతో ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించిన ఇండిగో,(Indigo Airlines) కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరింది. కస్టమర్లకు చెల్లించాల్సిన రిఫండ్‌ల ప్రక్రియకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కార్యకలాపాలను తిరిగి గాడిన పెట్టేందుకు తమ బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయని పేర్కొంది. నిన్నటితో పోలిస్తే శనివారం రద్దయిన విమానాల సంఖ్యను 850కి తగ్గించగలిగామని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను మరింత తగ్గిస్తామని ఇండిగో భరోసా ఇచ్చింది.
Read also: రసగుల్లా కోసం పెళ్లినే రద్దు చేసుకున్న షాకింగ్ ఘటన

కేంద్రం అల్టిమేటం: రైల్వే నుంచి అదనపు సహకారం
ఈ సంక్షోభంపై(Indigo Airlines) కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ(Ministry of Aviation) తీవ్రంగా స్పందించి, ఇండిగో యాజమాన్యానికి కఠిన ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న రిఫండ్‌ల మొత్తాన్ని ఆదివారం రాత్రి 8 గంటల లోపు క్లియర్ చేయాలని అల్టిమేటం విధించింది. లగేజీని 48 గంటల్లోగా గుర్తించి, ప్రయాణికులకు చేర్చాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ గడువులోగా సమస్యలను పరిష్కరించకుంటే కఠిన చర్యలు తప్పవని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. మరోవైపు, విమానాల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఉపశమనం కల్పించేందుకు భారతీయ రైల్వే శాఖ ముందుకు వచ్చింది. ఆకస్మిక రద్దీని తట్టుకునేందుకు దేశవ్యాప్తంగా 37 ప్రీమియం రైళ్లకు అదనంగా 116 కోచ్‌లను జత చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా 114 అదనపు ట్రిప్పులు అందుబాటులోకి రానున్నాయి. మొత్తంగా, ఇండిగో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అటు సంస్థ, ఇటు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: