Compensation : భారీ ఆపరేషనల్ అంతరాయాల నేపథ్యంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ డిసెంబర్ 3 నుంచి 5 వరకు తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు ₹10,000 విలువైన ట్రావెల్ వౌచర్లు అందిస్తామని ప్రకటించింది. ఈ పరిహారం DGCA నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన మొత్తానికి అదనమని ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది.
డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో కొన్ని ఎయిర్‌పోర్టులలో గంటల తరబడి ప్రయాణికులు వేచి ఉండాల్సి రావడం, భారీ ట్రాఫిక్ మరియు ఆపరేషన్లలో సమస్యల వల్ల అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇండిగో తెలిపింది. ఈ ప్రయాణికుల కోసం 12 నెలల వరకు వినియోగించుకునేలా ₹10,000 వౌచర్లు అందజేస్తున్నట్లు పేర్కొంది.
Latest News: AP Cabinet: ఉద్యోగులకు డీఏ శుభవార్త.. ₹9,500 కోట్లతో 506 మున్సిపల్ ప్రాజెక్టులకు అనుమతి
ఇక మరోవైపు, ఆపరేషన్లు స్థిరపడేందుకు ఇండిగో తన(Compensation) శీతాకాల షెడ్యూల్‌లోని విమానాలను 10% తగ్గించాలి అని నియంత్రణ సంస్థలు ఆదేశించాయి. డిసెంబర్ 2 వరకు ఇండిగో రోజుకు 2,300 విమానాలు నడుపుతోంది.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ప్రయాణానికి 24 గంటలలోపు రద్దయిన విమానాల కోసం ₹5,000 నుండి ₹10,000 వరకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అదనంగా కొత్తగా ప్రకటించిన వౌచర్లు ప్రయాణికులకు అదనపు సాయం అవుతాయని ఇండిగో తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :