భారతీయ రైల్వే(Indian Railways) ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా మరో కీలక అడుగు వేస్తోంది. ఇప్పటికే వేగం, సౌకర్యాలతో ప్రజాదరణ పొందిన వందే భారత్ రైళ్లను ఇప్పుడు స్లీపర్ కోచ్‌లతో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏడాది చివరికల్లా వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలపైకి రానున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
Read Also:EPFO: ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ.. వచ్చే మార్చిలో అమల్లోకి

దూర ప్రయాణికుల కోసం స్లీపర్ వందే భారత్
ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైళ్లు(Indian Railways) సీటింగ్ సౌకర్యంతో మాత్రమే ఉండటంతో, దీర్ఘదూర ప్రయాణాలు చేసే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రిపూట ప్రయాణాలకు అనువుగా స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను రైల్వేశాఖ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రైళ్ల తయారీ ఇప్పటికే పూర్తవ్వగా, ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు చివరి దశలో ఉన్నాయి.
తొలి వందే భారత్(Vande Bharat) స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను పాట్నా – ఢిల్లీ మధ్య ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8 గంటల్లో ఈ రైలు పూర్తి చేయనుంది. గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం దీనికి ఉంది.
వారానికి ఆరు రోజులు సర్వీస్
ఈ స్లీపర్ వందే భారత్ రైలు ఇప్పటికే ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కొత్త ఏడాది రాకముందే ఈ సేవలను ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. వారానికి ఆరు రోజులు పాట్నా – ఢిల్లీ మధ్య ఈ రైలు నడవనుంది. మొత్తం 16 కోచ్‌లు ఇందులో ఉండనున్నాయి. ఛార్జీల వివరాలను ఇంకా ప్రకటించలేదు కానీ, సేవలు రాజధాని ఎక్స్‌ప్రెస్ తరహాలోనే ఉంటాయని తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా విస్తరణ ప్రణాళిక
రాత్రిపూట ప్రయాణాల్లో ఎక్కువ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. స్లీపర్ కోచ్‌లతో పాటు అధునాతన సదుపాయాలు, వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మార్గాలను కవర్ చేసేలా ఈ రైళ్లను విస్తరించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: