రైలు ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే(Indian Railways) కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో అనుమతించిన పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లే ప్రయాణికులపై అదనపు ఛార్జీలు విధించేందుకు సిద్ధమైంది. రద్దీ, భద్రత మరియు ఇతర ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే లగేజీ పరిమితులు ఉన్నప్పటికీ, వాటిని చాలామంది పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యకు ఉపక్రమించారు.
Read also: Harish Rao: స్పీకర్ నిర్ణయంతో రాజ్యాంగంపై చెలరేగిన రాజకీయ దుమారం

కోచ్‌ల వారీగా లగేజీ పరిమితులు
కొత్త నిబంధనల ప్రకారం, స్లీపర్ క్లాస్ మరియు ఏసీ 3-టైర్‌లో ప్రయాణించే వారు గరిష్ఠంగా 40 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. 2వ ఏసీ క్లాస్ ప్రయాణికులకు ఈ పరిమితిని 50 కిలోలుగా నిర్ణయించారు. ఇక 1వ క్లాస్‌లో ప్రయాణించే వారికి 70 కిలోల వరకు లగేజీ అనుమతిస్తారు. జనరల్ బోగీలో ప్రయాణించే వారు గరిష్ఠంగా 35 కిలోల వరకే సరుకులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ పరిమితులను మించి లగేజీ ఉంటే, రైల్వే నిబంధనల ప్రకారం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు.
పిల్లలు, కుటుంబ ప్రయాణికులకు ప్రత్యేక వెసులుబాటు
Indian Railways: 5 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల విషయంలో రైల్వే కొంత వెసులుబాటు కల్పించింది. పెద్దలకు అనుమతించిన లగేజీ పరిమితిలో 50 శాతం వరకు లేదా గరిష్ఠంగా 50 కిలోల వరకు పిల్లల లగేజీకి అనుమతి ఉంటుంది. కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి ఇది కొంత ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు. అయితే ఈ పరిమితులను మించినప్పుడు మాత్రం ఛార్జీలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణానికి ముందు లగేజీ బరువును పరిశీలించుకోవాలని, అవసరమైతే పార్సెల్ సేవలను వినియోగించుకోవాలని రైల్వే సూచిస్తోంది.
రైళ్లలో ఎంత వరకు లగేజీ ఉచితంగా తీసుకెళ్లవచ్చు?
కోచ్‌ను బట్టి 35Kg నుంచి 70Kgల వరకు అనుమతి ఉంటుంది.
పరిమితి మిస్తే ఏం జరుగుతుంది?
అదనపు లగేజీపై ఛార్జీలు వసూలు చేస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: