రైల్‌వన్ యాప్ ద్వారా అన్‌రిజర్వుడ్ టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు మూడు శాతం డిస్కౌంట్ అందించనున్నట్లు రైల్వే శాఖ (Indian Railway) వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి జులై 14 వరకు ఇది అమల్లో ఉంటుందంటూ చెప్పుకొచ్చింది. అంటే సంక్రాంతి నుంచి ఆఫర్‌ను ప్రారంభించనుంది. సంక్రాంతి ఇంటికెళ్లేందుకు రైల్వే టికెట్లు బుక్ చేసుకునేవారికి ఇది శుభవార్తగా తెలిపింది.
Read Also: Environmental protection: పర్యావరణ పరిరక్షణ ఎన్నికల ప్రచారాస్త్రం కావాలి

రైల్ వన్ యాప్‌లో ఏ డిజిటల్ పేమెంట్ మోడ్‌తో టికెట్లు బుక్ చేసుకున్నా ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఇప్పటికే ఈ యాప్‌లో ఆర్-వ్యాలెట్ ద్వారా చెల్లింపులు చేసినవారికి క్యాష్ బ్యాక్ అందిస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ ఎప్పటిలాగే అందిస్తామని, దానితో పాటు కొత్తగా ఈ ఆఫర్ తెచ్చినట్లు పేర్కొంది.
రైల్ వన్ యాప్ అంటే..?
ప్రయాణికులకే అన్నీ సేవలు ఒకేచోట అందించాలనే లక్ష్యంతో రైల్వే శాఖ కొత్తగా ఈ యాప్ ప్రవేశపెట్టింది. ఇందులో ట్రైన్ టికెట్ల బుకింగ్‌తో పాటు ఫ్లాట్‌ఫామ్ టికెట్ కూడా తీసుకోవచ్చు. అలాగే ట్రైన్ల షెడ్యూల్, లైవ్ ట్రాకింగ్, ఫుడ్ బుకింగ్ వంటి సేవలు ఒకేచోట పొందవచ్చు. అన్నీ ఒకేచోట అందించాలనే ఉద్దేశంతో ఈ యాప్ అందుబాటులోకి తె్చింది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ వెర్షన్లలో ఉంది. రిజర్వుడ్‌తో పాటు అన్ రిజర్వుడ్ టికెట్లను కూడా ఈ యాప్‌లో బుక్ చేసుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: