భారత్–చైనా సంబంధాలలో కొత్త ఆర్థిక దశ ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు భారతీయ ఔషధాలపై కఠిన నియంత్రణలు విధించిన చైనా, ఇటీవల వాటిపై సడలింపులు ఇవ్వడం గమనార్హం. ముఖ్యంగా జనరిక్ ఔషధాల దిగుమతికి చైనా ఆసక్తి చూపించడం రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాల విస్తరణకు సూచనగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల చైనా ప్రభుత్వం నిర్వహించిన టెండర్‌లో భారతీయ ఫార్మా దిగ్గజాలు సిప్లా, నాట్కో, హెటిరో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లు పాల్గొని కాంట్రాక్టులు దక్కించుకోవడం ఈ మార్పుకు నిదర్శనం. చైనా ప్రభుత్వ ఆధీనంలోని ఆసుపత్రులకు ఈ సంస్థలు విస్తృతంగా మందులు సరఫరా చేయనున్నాయి.
Jubilee Hills By Election Exit Poll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలవబోతుందో చెప్పిన ఎగ్జిట్ పోల్స్
భారత్–చైనా సంబంధాలలో కొత్త ఆర్థిక దశ ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు భారతీయ ఔషధాలపై కఠిన నియంత్రణలు విధించిన చైనా, ఇటీవల వాటిపై సడలింపులు ఇవ్వడం గమనార్హం. ముఖ్యంగా జనరిక్ ఔషధాల దిగుమతికి చైనా ఆసక్తి చూపించడం రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాల విస్తరణకు సూచనగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల చైనా ప్రభుత్వం నిర్వహించిన టెండర్‌లో భారతీయ ఫార్మా దిగ్గజాలు సిప్లా, నాట్కో, హెటిరో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లు పాల్గొని కాంట్రాక్టులు దక్కించుకోవడం ఈ మార్పుకు నిదర్శనం. చైనా ప్రభుత్వ ఆధీనంలోని ఆసుపత్రులకు ఈ సంస్థలు విస్తృతంగా మందులు సరఫరా చేయనున్నాయి.

ఈ ఒప్పందం కింద మొదటగా భారతీయ కంపెనీలు “డపాగ్లిఫ్లోజిన్” అనే మధుమేహ నియంత్రణ టాబ్లెట్లను చైనా మార్కెట్‌కి సరఫరా చేయనున్నాయి. ఈ మందు ప్రపంచవ్యాప్తంగా షుగర్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, భవిష్యత్తులో ఇతర థెరపీ సెగ్మెంట్లలోని మందులు. ఉదాహరణకు యాంటీబయాటిక్స్, యాంటీహైపర్‌టెన్సివ్ డ్రగ్స్, ఆంకాలజీ మెడిసిన్స్ సరఫరా చేయడానికి కూడా భారత కంపెనీలకు అవకాశాలు కల్పించనున్నట్లు సమాచారం. చైనా సాధారణంగా అమెరికా, యూరప్ దేశాల నుండి మందులను దిగుమతి చేసుకునేది. కానీ, భారత జనరిక్ ఔషధాల నాణ్యత, ధర పరంగా అందుబాటు కారణంగా ఇప్పుడు వాటిపైనే దృష్టి సారించింది.
ఫార్మా రంగ నిపుణులు ఈ పరిణామాన్ని భారత ఔషధ పరిశ్రమకు గొప్ప మైలురాయిగా భావిస్తున్నారు. భారతదేశం ప్రపంచ జనరిక్ మార్కెట్‌లో 20% వాటాను కలిగి ఉంది. చైనా వంటి భారీ జనాభా ఉన్న దేశం భారత ఔషధాలను గుర్తించి ఆమోదించడం, ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తుల ప్రతిష్ఠను పెంచుతుందని నిపుణుల అభిప్రాయం. ఇది భవిష్యత్తులో ద్వైపాక్షిక వ్యాపార సంబంధాల బలోపేతానికి దారితీస్తుందని, భారత ఫార్మా రంగం చైనా మార్కెట్లో స్థిరమైన స్థానం పొందే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కూడా ఫార్మా ఎగుమతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ఆలోచిస్తోంది.