గాజా, ఇరాన్‌పై ఇజ్రాయిల్ సృష్టిస్తున్న నరమేధం (Humanity)పట్ల భారత్ మౌనంగా వీడాలని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అన్నారు. భారత్ మౌనంగా (India is silent)ఉంటే తన స్వరాన్ని కోల్పోవడమే కాదు, విలువల్ని (values)సరెండర్ చేసినట్లు అవుతుందని ఆమె పేర్కొన్నారు.

గాజా, ఇరాన్‌పై ఇజ్రాయిల్ సృష్టిస్తున్న మారణహోమం పట్ల భారత్ మౌనంగా ఉండడాన్ని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ తప్పుపట్టారు. భారత్ తన స్వరాన్ని కోల్పోవడమే కాదు, విలువల్ని సరెండర్ చేసినట్లు అవుతుందని ఆమె పేర్కొన్నారు. ద హిందూ ఆంగ్ల దినపత్రికలో సోనియా రాసిన వ్యాసాన్ని పబ్లిష్ చేశారు. పాలస్తీనా, ఇజ్రాయిల్ అంశంపై గతంలో కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయడంలో కేంద్రంలోని మోదీ సర్కారు విఫలమైనట్లు ఆమె పేర్కొన్నారు.
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
భారత్ తన వైఖరిని స్పష్టం చేయడంలో ఆలస్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇప్పటికైనా ఆలస్యం కాలేదని, భారత్ తన నిర్ణయాన్ని స్పష్టంగా తెలుపాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పశ్చిమాసియాలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు దౌత్యపరమైన చర్చలు చేపట్టాలని ఆమె తన వ్యాసంలో సూచించారు. పశ్చిమాసియా అంశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధ్వంసకర వైఖరిని ఆమె ఖండించారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ గాజా మరియు ఇరాన్‌పై ఇజ్రాయెల్ చర్యలపై భారత్ వైఖరిపై గట్టిగా స్పందించడం రాజకీయ, మానవతా దృష్టికోణాల్లో చర్చకు అంశంగా మారింది.
మౌనం ఒక విధంగా దాడుల్ని సమర్థించడానికే
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ గాజా మరియు ఇరాన్‌పై ఇజ్రాయెల్ చర్యలపై భారత్ వైఖరిపై గట్టిగా స్పందించడం రాజకీయ, మానవతా దృష్టికోణాల్లో చర్చకు అంశంగా మారింది. ఇజ్రాయెల్ పాక్షికతతో వ్యవహరించడంపై కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు తరచూ విమర్శలు చేస్తున్నాయి. గాజా ఘటనల్లో పౌరుల మరణాలు అధికమవుతుండగా, భారత్ గట్టి పేస్ తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
సోనియా గాంధీ అభిప్రాయం ప్రకారం, ఇటువంటి విషయాల్లో మౌనం ఒక విధంగా దాడుల్ని సమర్థించడానికే చేరుతుందని భావించాలి. అటువంటి మౌనం భారత చారిత్రక నైతిక స్థాయిని దెబ్బతీస్తుందని ఆమె హెచ్చరించారు.అయితే ఇటీవల విదేశాంగ విధానంలో కొన్ని మార్పులు రావడం వల్ల ఈ మద్దతు బలహీనపడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ వ్యాఖ్యలు భారత్ విదేశాంగ విధానంపై దేశీయంగా, అంతర్జాతీయంగా చర్చకు దారి తీసే అవకాశం ఉంది. మానవతా విలువలపై దేశం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also:Air India: అహ్మదాబాద్ ఘటన ..ముగ్గురిపై వేటుకు సిద్దమైన డీజీసీఏ