हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: India: స్వదేశీ సాంకేతికత ప్రాధాన్యత పెంచుకోవాలి.. పీయూశ్​ గోయల్

Sushmitha
Telugu News: India: స్వదేశీ సాంకేతికత  ప్రాధాన్యత పెంచుకోవాలి.. పీయూశ్​ గోయల్

న్యూఢిల్లీ: స్థిరమైన ఆర్థిక వ్యవస్థను, సార్వభౌమత్వాన్ని సాధించడానికి భారతదేశం కీలక సాంకేతికతలు, వనరుల విషయంలో ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) సూచించారు. స్వదేశీ పిలుపు కేవలం ‘మేక్ ఇన్ ఇండియా’ గురించి కాదని, దేశ దీర్ఘకాలిక వృద్ధికి ఇది దోహదపడుతుందని అన్నారు. ఇంధన వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధాల విషయంలో ప్రపంచదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం దేశ అభివృద్ధికి చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

Read Also:  AP Crime: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని యువతి ఆత్మహత్య

India

సాంకేతికతపై దృష్టి, గోయల్ వ్యాఖ్యల ప్రాధాన్యం

కొవిడ్ మహమ్మారి తర్వాత జరిగిన పరిణామాలు స్వదేశీ సాంకేతికత, స్థిరమైన సరఫరా వ్యవస్థ ఎంత ముఖ్యమో చాటి చెప్పాయని మంత్రి గోయల్ అన్నారు. ప్రపంచానికి సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్‌గా మాత్రమే కాకుండా, ప్రపంచ ఆవిష్కరణల ఇంజిన్‌గా మారాలని భారత్ నిర్ణయించిందని ఆయన వ్యాఖ్యానించారు. చమురు, సెమీకండక్టర్లు, అరుదైన ఖనిజాల విషయంలో భారత్ విదేశాలపై ఆధారపడుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సెమీకండక్టర్లపై విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు కేంద్రం 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులపై దాదాపు రూ.1.6 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెడుతోంది. అలాగే, ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0’ ని కూడా ప్రకటించింది.

ప్రధాని మోదీ పిలుపు: ‘హర్ ఘర్ స్వదేశీ’

ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) కూడా దేశ స్వయం సమృద్ధికి తదుపరి తరం సంస్కరణలు ఆగబోవని స్పష్టం చేశారు. ‘వస్తు సేవల పన్ను (జీఎస్టీ) 2.0’ అనేది దేశ వృద్ధికి మద్దతుగా నిలిచే డబుల్ డోస్ అని ఆయన పేర్కొన్నారు. స్వదేశీ/స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’, ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదాలను సాకారం చేయాలని మోదీ కోరారు. “హర్ ఘర్ స్వదేశీ” నినాదంతో ప్రతి ఇంటి ముందూ స్వదేశీ బోర్డులు ఏర్పాటు కావాలని, దేశ మట్టిలోని పరిమళంతో నిండిన వస్తువులనే కొనుగోలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం రూ.లక్ష కోట్ల విలువైన వంటనూనె దిగుమతి చేసుకుంటున్నామని, ఈ డబ్బు బయటకు వెళ్లకుండా ఆపగలిగితే ఎన్నో పాఠశాలలు నిర్మించుకోవచ్చని మోదీ అన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870