భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్ చేశారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. అలాగే ఉగ్రవాదంపై భారత్ జరుపుతోన్న పోరాటంలో తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఉభయ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని మోడీ, పుతిన్ పునరుద్ఘాటించారు. ఈ నెల 9న రష్యా విక్టరీ డేను నిర్వహించుకోనుంది. దీనిపై రష్యా అధ్యక్షుడికి మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈయేడాది రెండు దేశాల మధ్య వార్షిక సదస్సు భారత్‌లో నిర్వహించనున్నారు. అందుకోసం మన ప్రధాని ఆహ్వానం పలకగా పుతిన్ అంగీకరించారు. ఈ విషయాలను మన విదేశాంగ శాఖ వెల్లడించింది. పహల్గాంలోని బైసరన్ లోయలో గత నెల 22న పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.

India : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు.
ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి తాము బాధ్యులమని పాక్ కేంద్రంగా ఉన్న లష్కరే తోయిబాకు చెందిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ బాధ్యత ప్రకటించుకుంది. దీని భారత్ ప్రభుత్వం గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఇక ఈ ఘటన తర్వాత పాక్ నడ్డి విరిచేలా భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రికత్తలు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల వేళ ఐరాస భద్రతా మండలిలో సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలోనే పుతిన్ ఫోన్ చేశారు. ఇంతకుముందు పహల్గాం ఘటన తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ప్రధాని మోడీకి పుతిన్ లేఖ రాశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇలాంటి క్రూరమైన నేరానికి ఎలాంటి సమర్ధన లేదని పేర్కొన్నారు.
Read More : Alcazar: అల్కాట్రాజ్ కారాగారాన్ని మళ్లీ తెరవాలని ట్రంప్ ఆదేశం