భారతదేశంలో (India) ఈ-పాస్‌పోర్ట్ సేవలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఇది ఎలక్ట్రానిక్ పరికరం ఆధారంగా పనిచేస్తుంది, దీని బ్యాక్ కవర్ లోని చిప్‌లో పాస్‌పోర్ట్ దారుడి బయోమెట్రిక్ (Biometric) వివరాలు ఉంటాయి. ఈ-పాస్‌పోర్ట్ ద్వారా విమానాశ్రయాలలో స్కానింగ్, తనిఖీ ప్రక్రియ వేగవంతం అవుతుంది. 36 పేజీల బుక్‌లెట్‌కు రూ.1,500, 60 పేజీల బుక్‌లెట్‌కు రూ.2,000 రుసుము చెల్లించాలి. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు, రెన్యువల్ చేసుకునేవారు కూడా ఈ-పాస్‌పోర్ట్ పొందవచ్చు. ప్రస్తుతం కొన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఈ సేవను త్వరలో మరిన్ని కేంద్రాలకు విస్తరించనున్నారు.
Read also: Central Govt: ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెంటిలేటర్ బిల్లులకు బ్రేక్

ఈ-పాస్‌పోర్ట్ అంటే ఏంటి?
ఇది కూడా సాధారణ పాస్‌పోర్ట్ లాంటిదే. అయితే, ఇది ఎలక్ట్రానిక్ డివైజ్ ఆధారంగా పని చేస్తుంది. ఈ పాస్‌పోర్ట్ బ్యాక్ కవర్లో ఒక చిప్ ఉంటుంది. (India) ఈ చిప్ లో పాస్‌పోర్ట్ దారుడి బయోమెట్రిక్ వివరాలు.. అంటే ఫింగర్ ప్రింట్స్, ఫేసియల్ రికగ్నిషన్, డిజిటల్ సైన్ వంటివి ఉంటాయి. పైగా ఈ చిప్ ను ట్యాంపర్ చేయడానికి వీల్లేదు. ఎయిర్ పోర్టుల్లో సాధారణంగా పాస్‌పోర్ట్ బుక్ ను పరిశీలిస్తారు. అందులో ఫొటో, సంతకం వంటివి సిబ్బంది తనిఖీ చేస్తారు.
వాటిని సరిచూసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయితే, ఈ-పాస్‌పోర్ట్ ద్వారా అలా స్కాన్ చేయగానే పూర్తి వివరాలు డిజిటల్ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతాయి. దీంతో స్కానింగ్ చేయడం సులభమవుతుంది. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. ఈ-పాస్‌పోర్ట్ డాక్యుమెంట్ వెనుక భాగంలో ఒక గోల్డ్ కలర్ సింబల్ ఉంటుంది. దీని ద్వారా ఇది చిప్ ఎనేబుల్డ్ పాస్‌పోర్ట్ అని గుర్తించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: