ఇరాన్ (Iran) మద్దతుతో యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటు దళాలు ఎర్ర సముద్రాన్ని వేదికగా చేసుకుని వాణిజ్య నౌకలపై తీవ్ర దాడులు జరుపుతున్నాయి. తాజాగా లిబేరియన్ జెండా ఉన్న ఓ నౌకపై హౌతీలు దాడి చేయడంతో, దీనిపై ఇజ్రాయెల్ (Israel) డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) కౌంటర్ యాక్షన్ చేపట్టింది.ఆదివారం సాయంత్రం నుంచి ఇజ్రాయెల్ గగనతల దాడులు ప్రారంభించగా, సోమవారం దాకా అవి కొనసాగాయి. దక్షిణ యెమెన్ ప్రాంతాల్లోని హౌతీ స్థావరాలైన హోడెదా, రాస్ ఈసా, సలిఫ్ బందరు లక్ష్యంగా చేశారు. దీంతోపాటు రాస్ కానాటిబ్ పవర్ ప్లాంట్‌ను కూడా బాంబులతో మట్టుబెట్టినట్లు IDF ప్రకటించింది.ఇక 2023లో భారత్‌కు రానున్న ‘గెలాక్సీ లీడర్’ నౌకను హౌతీలు అపహరించగా, దాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన నౌకగా భావించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజా దాడుల్లో ఆ నౌకను పూర్తిగా ధ్వంసం చేశామని ఐడీఎఫ్ వెల్లడించింది.

ఎర్ర సముద్రంలో మళ్లీ ఉద్రిక్తత
ఇజ్రాయెల్ కౌంటర్ దాడుల నేపథ్యంలో ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. వాణిజ్య నౌకలు ఆ మార్గాన్ని ఉపయోగించడంపై ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే అమెరికా, యూరోప్ దేశాలు హౌతీ దాడులను తీవ్రంగా ఖండించాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ నేరుగా దాడులకు దిగడంతో, మధ్యప్రాచ్యంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారనుంది.
ఇజ్రాయెల్-హౌతీ ఎదురు దాడులు మళ్లీ పెరుగుతాయా?
ప్రస్తుతం హౌతీ దాడులకు ఇజ్రాయెల్ కౌంటర్ రెస్పాన్స్ ఇస్తుండటం గమనార్హం. ఇది భవిష్యత్తులో బృహత్తర సైనిక సంఘర్షణలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ మద్దతు, హౌతీ చర్యలు, ఇజ్రాయెల్ కదలికలు అన్నీ కలగలిపి ఆ ప్రాంతాన్ని సంక్షోభానికి దారి తీసేలా చేస్తున్నాయి.
Read Also : Hyderabad family : అమెరికాలో హైదరాబాద్ కుటుంబం సజీవదహనం