పశ్చిమ బెంగాల్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్‌పూర్ (IIT Kharagpur) యూటర్న్ తీసుకున్నది. క్యాంపస్‌లోని హాస్టల్ డైనింగ్ హాల్‌లో వెజ్, నాన్-వెజ్ విద్యార్థులకు వేర్వేరుగా సీటింగ్ కోసం జారీ చేసిన నోటీసును రద్దు (Cancellation of notice) చేసింది. హాస్టల్ విద్యార్థులతోపాటు పూర్వ విద్యార్థుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గింది. ఆగస్ట్ 16న బీఆర్ అంబేద్కర్ డైనింగ్ హాల్‌లో శాఖాహారం, మాంసాహారం విద్యార్థుల కోసం విడిగా సీటింగ్ కేటాయించారు. విద్యార్థులు ఆ మేరకు ఆయా సీట్లలో కూర్చోవాలని నోటీస్ జారీ చేశారు.

కాగా, క్యాంపస్‌లోని హాస్టల్స్‌లో నివసించే విద్యార్థులు ఈ చర్యను విమర్శించారు. ఈ విషయం తెలిసిన పూర్వ విద్యార్థులు కూడా దీనిని తప్పుపట్టారు. ఈ చర్య విద్యార్థుల మధ్య విభజనకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఐఐటీ ఖరగ్‌పూర్ (IIT Kharagpur) యాజమాన్యం వెనక్కి తగ్గింది. బీఆర్ అంబేద్కర్ డైనింగ్ హాల్‌లో వెజ్, నాన్ వెజ్ విద్యార్థులకు ప్రత్యేక సీటింగ్ నోటీసును సెప్టెంబర్ 8న రద్దు చేసింది. మరోవైపు ఉన్నత అధికారులకు తెలియకుండా ఈ నోటీసు జారీ అయ్యిందని ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ సుమన్ చక్రవర్తి తెలిపారు. దీని గురించి తెలిసిన వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించి ఆ నోటీస్‌ను రద్దు చేసినట్లు చెప్పారు. విద్యాసంస్థలో ఆహార ప్రాధాన్యతల ఆధారంగా ఎలాంటి విభజన ఉండకూడదని ఆయన అన్నారు.
ఐఐటి ఖరగ్పూర్ దేనికి ప్రసిద్ధి చెందింది?
IIT KGP దాని విస్తృతమైన నివాస సౌకర్యాలకు ప్రసిద్ధి చెందింది. 2100 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న IIT ఖరగ్‌పూర్‌లో దాదాపు 10,000 మంది విద్యార్థులు ఉన్నారు. 1952లో నిర్మించిన పటేల్ హాల్ ఆఫ్ రెసిడెన్స్ భారతదేశం అంతటా మొట్టమొదటి IIT హాస్టల్.
భారతదేశంలో అతిపెద్ద ఐఐటి ఏది?
ఆగస్టు 18, 1951న ఇన్స్టిట్యూట్ అధికారిక ప్రారంభోత్సవానికి ముందు, ప్రస్తుత పేరు ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ అని మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వీకరించారు. IIT ఖరగ్‌పూర్ , ప్రేమగా IITKGP అని పిలుస్తారు, ఇది అన్ని IITలలో అతిపెద్ద క్యాంపస్‌ను కలిగి ఉంది – 2100 ఎకరాలలో మరియు 20000 మంది నివాసితులకు నిలయంగా, ఇది ఒక చిన్న టౌన్‌షిప్.
ఏ ఐఐటి ఉత్తమ క్యాంపస్ జీవితాన్ని కలిగి ఉంది?
మొత్తం మీద అత్యుత్తమ IIT క్యాంపస్ గురించి మాట్లాడుకుంటే, చాలా మంది విద్యార్థులు మరియు నిపుణులు IIT బాంబే అత్యంత శక్తివంతమైన మరియు బాగా అనుసంధానించబడిన క్యాంపస్‌ను కలిగి ఉందని అంగీకరిస్తున్నారు. ఇది ముంబై అనే పెద్ద నగరంలో ఉంది మరియు అద్భుతమైన సౌకర్యాలను అందిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: