ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 2025కు బై బై చెప్పేసి 2026కి ఘన స్వాగతం పలికారు. న్యూ ఇయర్ వేడుకలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంబరాన్ని అంటేలా జరిగాయి. దీంతో హైదరాబాద్ నగరంలో ఉన్న పబ్బులు, బార్లు, క్లబ్బులు కళకళలాడాయి. కానీ ఈ నేపథ్యంలోనే ఈ వేడుకల్లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. (HYD) హైదరాబాద్ లోని ఇల్యూషన్ పబ్ లో డీజే ఆర్టిస్ట్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతన్ని పోలీసులు అరెస్టు చేసినట్లు కూడా సమాచారం అందుతోంది. ఈ సందర్భంగా 5 గ్రాముల కొకైన్ సీజ్ కూడా చేశారు. అంతే కాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన సంగతి తెలిసిందే. నగరంలోని ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్(Ameerpet), అబిడ్స్, గన్‌ఫౌండ్రీ, బషీర్‌బాగ్, ఐమాక్స్, దోమలగూడ ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌లు చేశారు.
Read also: Nitish Kumar : తన ఆస్తి వివరాలు ప్రకటించిన బీహార్ సీఎం

న్యూ ఇయర్ సందర్భంగా మత్తు పదార్థాల రవాణా
మరోవైపు ఏపీలోని విశాఖపట్నంలో మత్తు ముఠాలు రెచ్చిపోయాయి. పోలీసులు నిఘాను దాటుకొని డ్రగ్స్ సరఫరాకు కుట్ర పన్నగా చివరికి పోలీసుల చేతికి చిక్కారు. (HYD) లాసన్స్ బే కాలనీలో గంజాయితో పాటు మత్తు పదార్థాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో డ్రగ్స్ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో లాసన్స్ బే కాలనీ పరిధిలో ఒక డియో బైక్‌పై అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురు యువకులను అడ్డగించారు. వారిని సోదా చేయగా భారీగా గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాలు బయటపడ్డాయి. వెంటనే పోలీసులు ఆ సామాగ్రిని స్వాధీనం చేసుకుని, ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. నిందితులను వినయ్, సాయి, శ్యామ్‌లుగా గుర్తించారు. ఈ గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడైన వినయ్ ఈ మత్తు పదార్థాలను బెంగళూరు నుంచి తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ పార్టీల కోసం, యువతను టార్గెట్ చేసుకుని వీటిని విశాఖకు తరలించినట్లు అనుమానిస్తున్నారు. కేవలం గంజాయే కాకుండా, సింథటిక్ డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: