కుటుంబ సభ్యులెవరూ రావడం లేదు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీని పరామర్శించేందుకు ఆమె కుటుంబ సభ్యులెవరూ రావడం లేదు. షిల్లాంగ్ జైలులోనెలరోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న సోనమ్ (Sonam) ను చూసేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ జైలుకు రాకపోవడం ఆమె నైజం పట్ల ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నది.
నిరంతర సీసీటీవీ కెమెరాల నిఘా కింద సోనమ్
షిల్లాంగ్ జైలులోని వార్డెన్ కార్యాలయానికి సమీపంలో ఉన్న గదిలో సోనమ్న ఉంచారు. ఆమెతోపాటు మరో ఇద్దరు అండర్ ట్రయల్ మహిళా ఖైదీలు (Female prisoners) కూడా ఉన్నారు. జైల్లో నిబంధనల ప్రకారం, ఆమెకు ఇంకాఎలాంటి పని అప్పగించలేదని, నిఘా కెమెరాలు ఆమె కదలికలను పర్యవేక్షిస్తున్నామని జైలు అధికారులుతెలిపారు. ఆమె తన నేరానికి ఏమాత్రం పశ్చాత్తాపపడటం లేదని వారు చెప్పారు.

ములాఖత్ అవకాశం ఉన్నా రాని కుటుంబ సభ్యులు
సోనమ్ జైలు నిబంధనలలో భాగంగా ములాఖత్ అవకాశం ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులు ఎవరూరాలేదని, కనీసం ఫోన్లో కూడా ఆమెతో మాట్లాడలేదని జైలు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్లోనిఇండోర్కు చెందిన రాజారఘువంశీ, సోనమ్ రఘువంశీలు ఈ ఏడాది మే 11న వివాహం చేసుకున్నారు. మే20న హనీమూన్ (Honeymoon) కోసం దంపతులు మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత వీరిద్దరూ కనిపించకుండాపోయారు. 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని ఓ జలపాతంలో గుర్తించారు. అనంతరం జూన్ 7న ఉత్తరప్రదేశ్లోని రాజీపూర్లో ఆమె ప్రత్యక్షమైంది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసులవిచారణలో తేలింది. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. మీడియాలో ఈ ఉదందంపై పలు కధనాలు ప్రసారం అయ్యాయి.
వదిలించుకునే ప్రయత్నంలో
ఈ ఉదంతం తర్వాత ఇలాంటి ఘటనలే దేశంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. దీంతో నూతన దంపతులు హనీమూన్ కు వెళ్లాలంటే ప్రత్యేకంగా భర్తలు సాహసంచేయడం లేదు. తమ ప్రాణాలు దక్కవనే భయాందోళనలో ఉంటున్నారు. ఎందుకంటే వివాహేతర సం
బంధాలతో భార్యలు తమ భర్తలను వదిలించుకునే ప్రయత్నంలో వారిని హతమార్చేందుకు వెనుకాడడంలేదు. ఈ ఘోరాలు పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఇష్టం లేకపోతే, విడాకులు తీసుకుని, నచ్చినవ్యక్తితో జీవించే హక్కు ఎవరికైనా ఉందని, కాని చంపే హక్కు ఎవరి ఇచ్చారని సోషల్మీడియాలో పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెఘాలయ రాష్ట్రం ఎందుకు ప్రసిద్ధి చెందినది?
మెఘాలయను సాధారణంగా “మేఘాల నివాస స్థలం” (Abode of Clouds) గా పిలుస్తారు.
మెఘాలయ సంస్కృతి ఏంటి?
మెఘాలయ రాష్ట్రానికి ప్రత్యేకమైన, సంపన్న ఆదివాసీ సంస్కృతి ఉంది. ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఖాసీలు, జైంటియాలు, గారోలు అనే మూడు ప్రధాన ఆదివాసీ గిరిజన జాతులు నివసిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Haryana: రూ.20 కోసం తల్లిని హతమార్చిన కొడుకు