ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, తన ఎలక్ట్రిక్ వాహన బ్రాండ్ ‘విడా’ (Vida) కింద మరో కొత్త ఉత్పత్తిని తీసుకురాబోతోంది. ఇప్పటికే విడా స్కూటర్లతో మార్కెట్‌లో ఉన్న ఈ సంస్థ, ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ‘ప్రాజెక్ట్ VXZ’ పేరుతో ఒక ఆకర్షణీయమైన టీజర్‌ను సోమవారం విడుదల చేసింది.
Read Also: Shiva movie: ‘శివ’లో మోహన్ బాబు పాత్రను వద్దన్నా ఆర్జీవీ..కారణం

EICMA 2025లో ఆవిష్కరణ
ఇటలీలోని మిలాన్ నగరంలో నవంబర్ 6 నుంచి 9 వరకు జరగనున్న ప్రతిష్ఠాత్మక EICMA 2025 ఆటో ఎగ్జిబిషన్‌లో ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను(electric bike) హీరో అధికారికంగా ప్రదర్శించనుంది. విడుదలైన టీజర్‌ను బట్టి చూస్తే, ఈ బైక్‌ను స్పోర్టీ డిజైన్‌తో తీర్చిదిద్దినట్లు స్పష్టమవుతోంది. షార్ప్ హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్, స్ప్లిట్ సీట్, వెడల్పాటి హ్యాండిల్‌బార్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. హెడ్‌ల్యాంప్ పక్కన ‘విడా’ అనే అర్థం వచ్చేలా ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయడం విశేషం.
మార్కెట్‌లో అంచనాలు
EICMA అనేది ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ కంపెనీలు తమ కొత్త మోడళ్లను ప్రదర్శించే అతిపెద్ద వేదిక. ఈ ఈవెంట్‌లో హీరోతో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్,(Royal Enfield) టీవీఎస్ వంటి ఇతర భారతీయ కంపెనీలు కూడా తమ నూతన వాహనాలను ఆవిష్కరించనున్నాయి. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, హీరో విడా నుంచి రాబోతున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌పై మార్కెట్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. బైక్‌కు సంబంధించిన బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ఇతర ఫీచర్ల పూర్తి వివరాలు ఆవిష్కరణ సందర్భంగా వెల్లడి కానున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: