HD Revanna : మాజీ మంత్రి, జేడీఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణకు లైంగిక వేధింపుల కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసును విచారించిన బెంగళూరు ట్రయల్ కోర్టు సోమవారం కీలక తీర్పు వెల్లడిస్తూ, రేవణ్ణపై నమోదైన అన్ని ఆరోపణలను కొట్టివేసింది. దీంతో ఆయనను పూర్తిగా నిర్దోషిగా ప్రకటించింది.
ఈ కేసులో తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి కె.ఎన్. శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంలో తీవ్రమైన ఆలస్యం జరిగిందని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఆలస్యం ఒక్కటే ఆరోపణలను కొట్టివేయడానికి సరిపోతుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. హసన్ జిల్లా హోలెనరసిపుర పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో రేవణ్ణపై ఐపీసీ 354, 354ఎ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు అయ్యాయి.
Read also: Cigarette price hike : సిగరెట్ ధరలు భారీగా పెంపు సెంట్రల్ ఎక్సైజ్ బిల్లు 2025కి ఆమోదం
2024 ఏప్రిల్‌లో రేవణ్ణ ఇంట్లో పనిచేసిన ఓ మహిళ ఆయనపై లైంగిక వేధింపుల (HD Revanna) ఫిర్యాదు చేసింది. అయితే, ఈ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు ఇప్పటికే సెక్షన్ 354ను కొట్టివేసింది. తాజాగా ట్రయల్ కోర్టు సెక్షన్ 354ఎ నుంచి కూడా విముక్తి కల్పించడంతో రేవణ్ణపై ఉన్న లైంగిక వేధింపుల కేసు పూర్తిగా ముగిసింది.
ఇదే వ్యవహారానికి సంబంధించి గతేడాది మేలో బాధితురాలిని కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై రేవణ్ణను సిట్ అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. ఈ కేసు ఆయన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అశ్లీల వీడియోల వ్యవహారంతో సంబంధం ఉందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. తాజా తీర్పుతో లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణకు పూర్తిస్థాయిలో న్యాయపరమైన ఉపశమనం లభించినట్టైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: