ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన: లవ్ బర్డ్స్‌పై దాడి
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ (UP Hathras) నగరంలో ఓ యువతి తన ప్రియుడితో కలిసి చౌక్ వద్ద ఛోలే-బటురే తింటుండగా, ఆమె సోదరుడు వచ్చి దాడి చేశాడు. లక్ష్మీ టాకీస్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఘటన పూర్తి వివరాలు
UP Hathras: హత్రాస్‌లోని రద్దీగా ఉండే లక్ష్మీ టాకీస్ (Lakshmi Talkies) ప్రాంతంలో ఒక జంట ఛోలే-బటురే తింటూ మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన యువతి సోదరుడు వారిని గమనించాడు. తన సోదరి ఓ యువకుడితో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉండటం చూసి కోపంతో ఊగిపోయాడు. వెంటనే బైక్ దిగి ఆ యువకుడి వద్దకు వెళ్లి “నా చెల్లితో ఏం చేస్తున్నావు?” అని ప్రశ్నిస్తూ దుర్భాషలాడాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
దాడి: ప్రియుడితో పాటు చెల్లిపై కూడా
యువతి తన సోదరుడిని ఆపడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. యువతి సోదరుడు ఆగకుండా ప్రియుడిపై దాడి (Attack on boyfriend) చేశాడు. పక్కనే ఉన్న స్థానికులు జోక్యం చేసుకుని గొడవను ఆపడానికి ప్రయత్నించినా, ఆ వ్యక్తి వారిని కూడా పక్కకు నెట్టి దాడి కొనసాగించాడు. ఈ క్రమంలో తన చెల్లెని కూడా జుట్టు పట్టుకుని లాగి, పిడిగుద్దులు గుద్దాడు. అనంతరం ప్రియుడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దాడిలో పాల్గొన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వీడియో వైరల్: భిన్నమైన అభిప్రాయాలు
ఈ దాడిని చూసిన కొంతమంది స్థానికులు తమ ఫోన్‌లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది యువతి సోదరుడి చర్యను సమర్థిస్తూ, “ఇలా బహిరంగంగా తిరిగితే కుటుంబ పరువు పోతుంది” అని కామెంట్లు చేస్తు్న్నారు. మరికొందరు ఇలా బహిరంగంగా దాడి చేయడం చట్టవిరుద్ధమని, ఇది దారుణమని విమర్శిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో లవ్ బర్డ్స్‌పై దాడికి కారణం ఏమిటి?
యువతి తన ప్రియుడితో చౌక్ వద్ద ఉన్నప్పుడు ఆమె సోదరుడు చూసి కోపంతో వచ్చి, వారిపై దాడి చేశాడు.
ఈ ఘటనపై ప్రజల స్పందన ఎలా ఉంది?
కొంతమంది యువతి సోదరుడిని సమర్థించగా, మరికొందరు బహిరంగంగా దాడి చేయడం తప్పని, ఇది చట్టవిరుద్ధమని విమర్శిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: