అమెరికా (America) లో విదేశీ ఉద్యోగుల శకం ముగిసిందని ఆదేశ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ అన్నారు. హెచ్ 1బీ (H-1B Visa) వీసాల,రుసుమును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీగా పెంచడంపై హావార్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టపడి పనిచేసే అమెరికన్ల నుంచి విదేశీ వ్యక్తులు ఉద్యోగాలు లాక్కునే పద్ధతికి కొత్త వీసా నిబంధనలు ముగింపు పలుకుతాయని,వ్యాఖ్యానించారు. దీంతో అమెరికాకు గణనీయమైన ప్రయోజనం లభిస్తుందని వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ (Howard Lutnick) అన్నారు.
డెమొక్రాట్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన హోవార్డ్
డెమొక్రాట్ల విధానాలతోనే అక్రమ వలసదారులతో అమెరికా నిండిపోయిందని ఆయనఆరోపించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఓపెన్-బోర్డర్ డెమొక్రాట్లు (Open-border Democrats) కష్టపడి పనిచేసే అమెరికన్ల ఖర్చుతో దేశాన్ని అక్రమ వలసదారులతో నింపారు. ట్రంప్ పరిపాలన యంత్రాంగం ఆ వినాశకరమైన ఎజెండాను పూర్తిగా తిరగరాస్తోంది అని హోవార్డ్ వ్యాఖ్యానించారు. అంతేకాక కష్టపడి పనిచేసే అమెరికన్ల నుంచి ఉద్యోగాలను లాక్కుంటున్న పద్ధతికి ముగింపు పలుకుతాం అని, ఆర్థికవ్యవస్థ (Economy) సద్వినియోగం చేసుకుని ప్రతిఫలంగా ఏమీ అందించకుండా పనిచేసే కార్మికులను,తగ్గిస్తాం.

ఉద్యోగాలు ఊడిపోయి, ఇండియాకు ఊసురోమంటూ
అది దేశానికి గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుంది అని హోవార్డ్ పేర్కొన్నారు. ఏదిఏమైనా ట్రంప్ తన విధానాల వల్ల ఇప్పటికే అమెరికాలో చదువుకునేందుకు భారతీయులు (Indians) విముఖతను వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ,దేశాల్లో చదువుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనేకులు తమ ఉద్యోగాలు ఊడిపోయి, ఇండియాకు ఊసురోమంటూ తిరిగొస్తున్నారు. కొత్త ఉద్యోగాలు రాక, ఉన్న ఉపాధి పోవడంతో తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో జీవించడంకంటే సొంత ఊర్లలో బతకడమే మేలనే నిర్ణయానికి చాలామంది భారతీయులు అంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: