gratuity rules 2025 : భారత ప్రభుత్వం కొత్త కార్మిక చట్టాలను అమలు చేస్తోంది. ఈ మార్పుల్లో ప్రధానమైనది—గ్రాచ్యుటీ అర్హత. ఇప్పటి వరకు ఉద్యోగి ఒక సంస్థలో కనీసం 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాతే గ్రాచ్యుటీ పొందగలిగేవారు. కానీ కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం, ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగులు కేవలం 1 సంవత్సరం పని చేసినా గ్రాచ్యుటీకి అర్హులు అవుతారు. ఇది దేశంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పెద్ద ఉపశమనం.
ఈ సంస్కరణలతో 29 పాత కార్మిక చట్టాలను 4 కొత్త లేబర్ కోడ్స్‌గా సమీకరించారు.(gratuity rules 2025) కేంద్ర కార్మిక శాఖ ప్రకారం, దీన్నిబట్టి ఉద్యోగులకు మెరుగైన వేతనాలు, విశాలమైన సోషల్ సెక్యూరిటీ, అలాగే ఆరోగ్య భద్రత అందించడమే లక్ష్యం. ఈ మార్పులు ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగులతో పాటు గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫార్మ్ వర్కర్లు, అప్రకటిత రంగ కార్మికులు, మహిళా ఉద్యోగులకు కూడా ప్రయోజనం కలిగిస్తాయి.
గ్రాచ్యుటీ అంటే సంస్థలో దీర్ఘకాలంగా పనిచేసిన ఉద్యోగికి ఆభినందనగా ఇచ్చే మొత్తము. సాధారణంగా రాజీనామా, రిటైర్మెంట్, లేదా ఉద్యోగం ముగిసినప్పుడు చెల్లిస్తారు. ఇప్పుడు ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగుల కోసం 1 సంవత్సరానికి గ్రాచ్యుటీ లభించడంతో, ఉద్యోగ మార్పుల సమయంలో కూడా వారికి ఆర్థికంగా మరింత భరోసా లభిస్తుంది.
Read also: Reservation-GO: 50% పరిమితిలోనే కొత్త రిజర్వేషన్లు—GO సిద్ధం
గ్రాచ్యుటీ లెక్కింపు కూడా ఒక ఫార్ములా ఆధారంగా ఉంటుంది
Last Drawn Salary × (15/26) × Years of Service.
ఇక్కడ Last Drawn Salaryలో బేసిక్ పే మరియు డియర్‌నెస్ అలవెన్స్ చేరతాయి. ఈ లెక్కింపు పద్ధతి యథావిధిగా కొనసాగుతుంది.
కొత్త నిబంధనలతో ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగులు శాశ్వత ఉద్యోగిలా సమానమైన జీత నిర్మాణం, సెలవులు, మెడికల్ బెనిఫిట్స్ మరియు ఇతర సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలను పొందుతారు. దీనితో కాంట్రాక్ట్ వర్కర్లపై ఆధారపడే వ్యవస్థ తగ్గి, డైరెక్ట్ హైరింగ్ పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ మొత్తం మార్పులు ఉద్యోగులకు మరింత స్థిరత్వం, సంస్థలకు మరింత బాధ్యతాయుతమైన వర్క్‌ఫోర్స్‌ను అందిస్తాయని కేంద్రం ప్రకటించింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :