దేశంలోనే మొదటి పూర్తి ఏసీ ప్రభుత్వ పాఠశాల కేరళలో
దేశంలోనే తొలిసారిగా పూర్తి ఏసీ (AC) గదులతో కూడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కేరళ ప్రభుత్వం నిర్మించింది. మల్లప్పురం జిల్లాలోని మేల్మురి ముట్టిపాడులో సుమారు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆధునిక పాఠశాల (Govt school) నిర్మాణం పూర్తయింది. అక్టోబర్ 19న సాయంత్రం 4 గంటలకు స్థానిక ఎంపీ ఈటీ ముహమ్మద్ బషీర్ ఈ పాఠశాలను ప్రారంభించనున్నారు
Read also: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం

అత్యాధునిక సదుపాయాలతో ప్రత్యేక ఆకర్షణ
ఈ రెండు అంతస్తుల పాఠశాలలో ఎనిమిది తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, స్టాఫ్ రూమ్, HM గది ఉన్నాయి. అన్ని గదుల్లో ఏసీలు, డిజిటల్ డిస్‌ప్లే స్క్రీన్‌లు, తాగునీటి సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ప్రతి తరగతిలో చిన్న లైబ్రరీ, షూ ర్యాక్‌లు, FRP ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.5 కోట్లు, స్థానిక ఎమ్మెల్యే పి.ఉబైదుల్ రూ.50 లక్షలు ఖర్చు చేశారు.
గ్రామీణ విద్యా మౌలిక వసతులకు ఆదర్శం
ఈ ఆధునిక పాఠశాల (Govt school) కేరళలోనే కాకుండా దేశంలోని ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. ఇది గ్రామీణ విద్యార్థులకు సౌకర్యవంతమైన, ఆధునిక వాతావరణాన్ని అందించి, భవిష్యత్తు పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: