రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం (Central Govt) ప్రవేశపెట్టిన ప్రధాన పంట బీమా పథకం ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) 2016 ఫిబ్రవరి 18న ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, వ్యాధులు తదితర కారణాలతో పంటలకు నష్టమొచ్చినపుడు రైతులకు ఆర్థిక భద్రత కల్పించబడుతుంది. ఇది కేవలం నష్టపరిహారాన్ని ఇవ్వడమే కాదు, రైతులు వ్యవసాయాన్ని ధైర్యంగా కొనసాగించేందుకు సహాయపడే విధంగా రూపొందించబడింది. తక్కువ బీమా ప్రీమియంతోనే పంటలకు భద్రత కల్పించడం ఈ పథకానికి ప్రత్యేకత.
దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే
ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియ కూడా చాలా సులభంగా ఉంది. రైతులు అధికారిక వెబ్‌సైట్ https://pmfby.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రైతుగా రిజిస్టర్ అవ్వాలి, పంట మరియు జిల్లా ఎంపిక చేయాలి, అవసరమైన పత్రాలు (ఆధార్, భూమి పత్రాలు, బ్యాంక్ వివరాలు) అప్‌లోడ్ చేసి, ప్రీమియాన్ని చెల్లించి ఫారమ్‌ను సమర్పించాలి. బీమా కవర్ పొందిన తర్వాత పంట నష్టానికి పరిహారం పొందొచ్చు. ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
కవర్ అయ్యే పంటల వివరాలు
ఈ పథకం ద్వారా ఖరీఫ్, రబీ, వాణిజ్య పంటలకు బీమా అందించబడుతుంది. ఉదాహరణకు బియ్యం, మక్క, శనగ, గోధుమ, పత్తి, బంగాళాదుంప మొదలైనవి. రాష్ట్రానికి అనుగుణంగా కవర్ అయ్యే పంటల వివరాలు వెబ్‌సైట్‌లో లభిస్తాయి. రైతులు వ్యవసాయ రుణం తీసుకున్నా లేదా స్వంత భూమిలో వ్యవసాయం చేస్తున్నా, అందరికీ ఈ పథకం లభిస్తుంది. ప్రకృతి సహజ విపత్తుల నేపథ్యంలో, PMFBY రైతులకు ఒక రక్షణ కవచంగా నిలుస్తుంది.
Read Also : TMC MP Mahua Moitra: పెళ్లి చేసుకున్న పొలిటికల్ ఫైర్ బ్రాండ్