రైల్వే శాఖ రైలు ప్రయాణికుల (Train Passengers) కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రయాణికులు టికెట్ కన్ఫర్మేషన్ స్టేటస్‌ను రైలు బయలుదేరే నాలుగు గంటల ముందు మాత్రమే తెలుసుకునే వీలుండేది. అయితే, ఈ విధానం వల్ల వెయిటింగ్ టికెట్ (Waiting ticket) ఉన్నవారు చివరి నిమిషంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే శాఖ ముందస్తు చార్ట్ ప్రిపరేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్టు వెల్లడించింది.
24 గంటల ముందే ఛార్ట్ ప్రిపరేషన్ పైలట్ ప్రాజెక్టు
ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా మొదటగా బికనీర్ డివిజన్‌లో అమలు చేయనున్నారు. రైలు బయలుదేరే 24 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్‌ను సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనివల్ల ప్రయాణికులు తమ టికెట్ కన్ఫర్మ్ అయ్యిందా, లేదా అన్న విషయాన్ని చాలా ముందుగానే తెలుసుకుని తదనుగుణంగా ఇతర మార్గాలు చూసుకునే అవకాశం పొందుతారు.
ఈ నిర్ణయం పట్ల ప్రయాణికులు హర్షం
ఈ విధానానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తే, దేశవ్యాప్తంగా అన్ని రైళ్లలో కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ఇది టికెట్ రద్దు ప్రక్రియకు గానీ, ప్లాన్ B కోసం ప్రయాణికులు చేసే ప్రయత్నాలకు గానీ చాలా ఉపయోగపడనుంది. వెయిటింగ్ లిస్ట్ ఉన్న ప్రయాణికులు మరింత స్పష్టతతో ముందుగానే నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది.
Read Also : Honeymoon Murder: భర్త రాజా రఘువంశీని చంపినట్లు ఒప్పుకున్న సోనమ్