ప్రస్తుతం రైళ్ల(Trains)లో ఉన్న అధిక రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ-మధురై, హైదరాబాద్-కొల్లం, హైదరాబాద్-కన్యాకుమారి మార్గాల్లో నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరిన్ని తేదీల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రైళ్లు తాత్కాలికంగా మాత్రమే కాకుండా, ఒక నిర్దిష్ట కాలానికి ప్రతివారం రాకపోకలు సాగిస్తాయని రైల్వే శాఖ వెల్లడించింది.
కాచిగూడ – మధురై స్పెషల్ ట్రైన్ వివరాలు
కాచిగూడ నుంచి మధురైకి వెళ్లే (07191) ప్రత్యేక రైలు ఆగస్టు 18 నుండి అక్టోబర్ 13 వరకు ప్రతి సోమవారం నడవనుంది. మధురై నుండి కాచిగూడకు తిరిగివచ్చే (07192) రైలు ఆగస్టు 20 నుండి అక్టోబర్ 15 వరకు ప్రతి బుధవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు రద్దీతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు ఇది ఉపశమనాన్ని కలిగించే అవకాశం ఉంది.
హైదరాబాద్ – కొల్లం, కన్యాకుమారి రైళ్లకు కొనసాగింపు
హైదరాబాద్ నుంచి కొల్లం వెళ్లే (07193) రైలు ఆగస్టు 16 నుండి అక్టోబర్ 10 వరకు ప్రతి శనివారం నడవనుండగా, కొల్లం నుండి హైదరాబాద్‌కు వచ్చే (07194) రైలు ఆగస్టు 18 నుండి అక్టోబర్ 13 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. అలాగే, హైదరాబాద్ – కన్యాకుమారి (07230) ప్రత్యేక రైలు ఆగస్టు 13 నుండి అక్టోబర్ 8 వరకు ప్రతి బుధవారం, కన్యాకుమారి – హైదరాబాద్ (07229) రైలు ఆగస్టు 18 నుండి అక్టోబర్ 10 వరకు ప్రతి శుక్రవారం నడవనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ రైళ్లతో దక్షిణ భారత ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది.
Read Also : Nara Lokesh : 18 రోజుల్లో 50 లక్షల ఇళ్ల సందర్శనతో టీడీపీ రికార్డ్