Farooq Abdullah: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాపై జమ్మూ శివార్లలో హత్యాయత్నం జరిగింది. ఒక వివాహ వేడుకలో పాల్గొన్న ఆయనపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే భద్రతా సిబ్బంది, అక్కడి ప్రజలు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
Read Also: Iran Allows Indian ships: హర్ముజ్ జలసంధిలో భారత్ ట్యాంకర్లకు లైన్ క్లియర్!
ఆ భయంకర క్షణాలను వివరించిన అబ్దుల్లా
“నేను క్షేమంగా ఉన్నాను, ఆ దేవుడే నన్ను కాపాడాడు” అని అబ్దుల్లా పేర్కొన్నారు. ఆ భయంకరమైన క్షణాలను గుర్తుచేసుకుంటూ.. “దాడి చేసిన వ్యక్తి నా మెడ వెనుక భాగం వరకు చేరుకోగలిగాడు. చివరి నిమిషంలో ఎన్‌ఎస్‌జీ (NSG) సహా సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకుని లొంగదీసుకున్నారు. వెంటనే నన్ను కారులోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు” అని ఆయన వెల్లడించారు.
భద్రతా వైఫల్యంపై సీఎం ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం..
ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. తన తండ్రికి జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ.. లోడ్ చేసిన తుపాకీతో ఒక వ్యక్తి అంత దగ్గరకు ఎలా రాగలిగాడు అని ఆయన ప్రశ్నించారు. ఇది స్పష్టమైన భద్రతా వైఫల్యమని ఆయన మండిపడ్డారు. డిప్యూటీ సీఎం సురీందర్ ఛౌదరి కూడా హోటల్ వద్ద భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని ఆరోపించారు. మరోవైపు నిందితుడి నేపథ్యంపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. జమ్మూలో దుకాణాలు నడుపుకునే కమల్ సింగ్‌కు.. ఫరూక్ అబ్దుల్లాపై అంతటి పగ ఎందుకు పెరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: