మావోయిస్టు(Maoist)ల కార్యకలాపాలను పూర్తిగా అణచివేయాలని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’(Operation Kagar) వేగంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎర్రదళాలను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో భద్రతా బలగాలు భారీ స్థాయిలో కూంబింగ్ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జరిగిన ఎన్‌కౌంటర్లలో పలువురు కీలక నేతలు చనిపోగా, మరికొందరు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా మావోయిస్టు(Maoist)లు ఒక బహిరంగ లేఖ విడుదల చేసి, ప్రభుత్వ సూచనపై స్పందించారు. ఆయుధాలు వదిలేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఇందుకు కొంత సమయం కావాలని పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరి వరకు అవకాశం ఇస్తే అధికారులకు లొంగిపోతామని తెలిపారు. అప్పటి వరకు అడవుల్లో జరుగుతున్న కూంబింగ్ చర్యలను నిలిపివేయాలని, భద్రతా బలగాలను వెనక్కి పిలివేయాలని డిమాండ్ చేశారు.
Read Also: Delhi blast: పక్కా ప్రణాళిక తో డాక్టర్లకు ఉగ్రవాదుల వల

ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కూంబింగ్ ఆపరేషన్లను ఆపితే, ఆయుధాలు అప్పగించే తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ(MMC Special Zonal Committee) అధికార ప్రతినిధి అనంత్ పేరిట విడుదల చేసిన లేఖలో వివరించారు.
లేఖలోని ముఖ్యాంశాలు
- ప్రస్తుతం పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించిందని పేర్కొన్నారు.
- ఫిబ్రవరి 15 వరకు గడువు ఇచ్చితే, ఆయుధాలు వదిలివేయడానికి అవసరమైన అంతర్గత చర్చలు పూర్తిచేయగలమని తెలిపారు.
- సహచర నాయకులతో కమ్యూనికేషన్ సులభం కాకపోవడం వల్ల ఈ సమయం అవసరమైందని తెలిపారు.
- ఈ కాలంలో PLGA వారోత్సవాలు సహా అన్ని కార్యక్రమాలను నిలిపివేస్తామని హామీ ఇచ్చారు.
- అదే సమయంలో బలగాల కూంబింగ్ చర్యలను నిలిపివేయాలని ప్రభుత్వాలను కోరారు.
మొత్తం మీద, ప్రభుత్వ చర్యలకు స్పందిస్తూ మావోయిస్టులు సమ్మతి ప్రకటించినప్పటికీ, అమలు విషయంలో కొంత సమయం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసినట్లు స్పష్టమవుతోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: