గిగ్ వర్కర్ల (Gig workers) సమ్మె పిలుపుతో ఇవాళ బిజినెస్ నష్టపోకుండా ఈ – కామర్స్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సేవలకు అంతరాయం కలగకుండా కంపెనీలు భారీ ఇన్సెంటివ్స్ (ప్రోత్సాహకాలు) ప్రకటించాయి. ఈరోజు (డిసెంబర్ 31న) ఆర్డర్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని జొమాటో సంస్థ తన డెలివరీ పార్ట్‌నర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య ఉండే పీక్ అవర్స్‌లో ఒక్కో ఆర్డర్‌కు రూ.120 నుంచి రూ.150 వరకు చెల్లించనున్నట్లు తెలిపింది.
Read Also: New Year 2026: కొత్త ఏడాది వేళ: కుటుంబానికే తొలి ప్రాధాన్యత

అదనపు పేమెంట్ ఆఫర్
ఆర్డర్ల లభ్యతను బట్టి ఒక్క రోజులోనే డెలివరీ బాయ్స్ రూ.3,000 వరకు సంపాదించుకునే అవకాశం కల్పించింది. అంతేకాకుండా ఆర్డర్లను రద్దు చేసినా లేదా తిరస్కరించినా విధించే పెనాల్టీలను తాత్కాలికంగా ఎత్తివేసింది. మరోవైపు స్విగ్గీ కూడా డెలివరీ వర్కర్లకు భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఈరోజు, రేపు.. ఈ రెండు రోజుల్లో కలిపి డెలివరీ పార్ట్‌నర్లు రూ.10,000 వరకు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా డిసెంబర్ 31 రాత్రి పీక్ అవర్స్‌లో రూ.2,000 వరకు అదనపు పేమెంట్ ఆఫర్ చేస్తోంది. క్విక్ కామర్స్ సంస్థ జెప్టో కూడా తమ డెలివరీ సిబ్బందికి ఇన్సెంటివ్స్ పెంచింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: