हिन्दी | Epaper

Gig Workers: గిగ్ వర్కర్లకు 90 రోజుల పని నిబంధన

Saritha
Gig Workers: గిగ్ వర్కర్లకు 90 రోజుల పని నిబంధన

గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Government) కొత్త నిబంధనలు ప్రతిపాదించింది. (Gig Workers) నాలుగు కొత్త కార్మిక చట్టాలకు (లేబర్ కోడ్స్) సంబంధించిన ముసాయిదా నిబంధనలను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ కొత్త విధానం ద్వారా తొలిసారిగా గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లను (ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు వంటివారు) కూడా సామాజిక భద్రత పరిధిలోకి తీసుకువస్తున్నారు. వారికి కనీస వేతనం, ఆరోగ్యం, వృత్తి భద్రత వంటి ప్రయోజనాలు అందనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త చట్టాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Read also: Sleeper bus : బస్సుల్లో సౌకర్యం కంటే భద్రతే ముఖ్యం!

Gig Workers: గిగ్ వర్కర్లకు 90 రోజుల పని నిబంధన

కేంద్రం కొత్త కార్మిక చట్టాల అప్‌డేట్

ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే అగ్రిగేటర్ వద్ద కనీసం 90 రోజులు, వేర్వేరు అగ్రిగేటర్ల వద్ద పనిచేసేవారు అయితే 120 రోజులు పని చేయాల్సి ఉంటుందని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. (Gig Workers) ప్రతి ఒక్కరూ ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఇప్పటికే కేంద్రం సూచించింది. అర్హులైన వారికి డిజిటల్ ఐడీ కార్డులను జారీ చేయనుంది.ఈ కొత్త చట్టాల ద్వారా మరికొన్ని ముఖ్యమైన మార్పులు కూడా రానున్నాయి. ఇకపై అన్ని రంగాల ఉద్యోగులకు యాజమాన్యాలు తప్పనిసరిగా నియామక పత్రాలు (అపాయింట్‌మెంట్ లెటర్లు) ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగ భద్రత, పారదర్శకత పెరుగుతాయి. అలాగే ఇప్పటివరకు కొన్ని నిర్దిష్ఠ‌ పరిశ్రమలకే పరిమితమైన కనీస వేతనం, ఇకపై అన్ని రంగాల కార్మికులకు చట్టబద్ధంగా వర్తిస్తుంది.అధిక వేతనాలు, మెరుగైన పని పరిస్థితులు కోరుతూ గిగ్ వర్కర్లు సమ్మెకు దిగడానికి ఒక రోజు ముందు, అంటే 2025 డిసెంబర్ 30న ఈ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ ముసాయిదాపై భాగస్వామ్య పక్షాల నుంచి కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాలను స్వీకరిస్తోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also: 

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870