ఒకప్పుడు ఉత్తరాలు, పోస్ట్‌కార్డులు మన భావోద్వేగాలను మోసుకెళ్లేవి. ప్రియమైన వారి చేతిరాత చూడగానే కలిగే ఆనందం వర్ణణాతీతం. కానీ నేటి డిజిటల్ యుగంలో.. ఇన్‌స్టంట్ మెసేజింగ్ ముందు ఆ పాత పద్ధతులు కనుమరుగయ్యాయి. ముఖ్యంగా నేటి యువతరం (Gen Z)కి పోస్ట్ కార్డు అంటే తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో.. ఆ పాత అనుబంధాన్ని తిరిగి తీసుకురావడానికి ‘ఇండియా పోస్ట్’ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే – Gen Z post office కాన్సెప్ట్. భారతదేశ వ్యాప్తంగా విద్యాసంస్థల్లోని 46 పోస్ట్ ఆఫీసులను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా.. ఆంధ్ర యూనివర్సిటీ (AU) సౌత్ క్యాంపస్‌లో ఒక ప్రత్యేకమైన Gen Z post office దాదాపుగా సిద్ధమైంది. ఇప్పటికే IIT-ఢిల్లీ, IIT-గాంధీనగర్‌లలో ఇలాంటి నమూనాలను ఏర్పాటు చేశారు.
Read Also: Accident: కొత్త జంట ప్రాణం తీసిన ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్

పోస్టల్ సేవలు, కొత్త పథకాలు
కాన్సెప్ట్ ఇదే.. విశాఖపట్నం రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ VS జయశంకర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కొత్త పోస్ట్ ఆఫీస్ యొక్క ముఖ్య ఉద్దేశం.. యువత ఆకర్షణ: సాంప్రదాయ పోస్ట్ ఆఫీస్‌ను యువతరం ఇష్టపడే విధంగా టెక్నాలజీ ఆధారిత హ్యాంగ్‌అవుట్ జోన్‌గా మార్చడం. సేవల విస్తరణ: పోస్టల్ సేవలు, కొత్త పథకాలు, కమ్యూనికేషన్ పద్ధతుల గురించి విద్యార్థులకు సులభంగా సమాచారం అందించడం. ట్రస్ట్ & లెగసీ: ఇండియా పోస్ట్ యొక్క విశ్వసనీయతను, వారసత్వాన్ని అలాగే కొనసాగిస్తూనే.. వాతావరణాన్ని మార్చడం. వైఫై, కేఫ్‌లు కూడా ఈ కొత్త డిజైన్‌తో కూడిన Gen Z post office కేవలం ఉత్తరాలు పంపే ప్రదేశంగా మాత్రమే ఉండదు. విద్యార్థులు ఇక్కడ సేదతీరడానికి, కలుసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కెఫెటేరియా (Cafeteria): కాఫీ తాగుతూ, స్నేహితులతో మాట్లాడేందుకు సౌకర్యం. టెక్నాలజీ-ఎనేబుల్డ్ జోన్‌గా మార్చడానికి వై-ఫై సదుపాయం. రాష్ట్రమంతటా.. విశాఖపట్నం, గుంటూరు, కర్నూలులలో కూడా త్వరలో ఇలాంటి ఆధునీకరించిన పోస్ట్ ఆఫీస్‌లను తెరవనున్నట్లు పోస్ట్‌మాస్టర్ జనరల్ జయశంకర్ తెలిపారు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: