మన వాహనానికి పెట్రోల్ లేదా డీజిల్ నింపేటప్పుడు మెషీన్‌లో ‘0.00’ చూపించడాన్ని ఖచ్చితంగా చెక్ చేస్తాం. కానీ అదే సమయంలో ఫ్యూయల్(Fuel Density) పంప్‌పై ఉండే డెన్సిటీ మీటర్ మీద చూపిస్తున్న నంబర్లు చాలా మంది గమనించరు. అసలు ఈ డెన్సిటీ రీడింగ్ ఎందుకు అంత ముఖ్యమో చాలా మందికి తెలియదు.
Read also: Ram Charan: ట్రంప్ జూనియర్‌తో రామ్ చరణ్

డెన్సిటీ అనేది ఫ్యూయల్ క్వాలిటీని నిర్ణయించే అత్యంత ముఖ్యమైన సూచికలలో ఒకటి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రకారం—
- పెట్రోల్ డెన్సిటీ: 720–775 kg/m³ (అంటే సుమారుగా 0.75 kg/L)
- డీజిల్ డెన్సిటీ: 820–860 kg/m³
ఈ రేంజ్‌కు బయట ఉన్న డెన్సిటీ అంటే ఫ్యూయల్‌లో కల్తీ ఉండే అవకాశం లేదా క్వాలిటీ తగ్గిపోయి ఉండే అవకాశం ఎక్కువ. అందుకే, మన వాహనానికి ఏ ఫ్యూయల్ వెళ్తుందో తెలుసుకునేందుకు డెన్సిటీ రీడింగ్ చాలా క్రిటికల్.
డెన్సిటీ ఫ్యూయల్ క్వాలిటీని ఎలా ప్రభావితం చేస్తుంది?
ఫ్యూయల్ డెన్సిటీ(Fuel Density) సరిగ్గా ఉంటేనే ఇంజిన్ సరైన దహనం చేస్తుంది. డెన్సిటీ తక్కువగా ఉంటే—
- ఫ్యూయల్‌లో మిశ్రమాలు ఉండే అవకాశం
- ఇంజిన్ పనితీరు తగ్గడం
- ఎక్కువ ఫ్యూయల్ ఖర్చవడం
- పికప్, మైలేజ్ రెండూ ప్రభావితం అవడం
డెన్సిటీ ఎక్కువగా ఉంటే—
- కార్బన్ డిపాజిట్లు పెరగడం
- ఇంజిన్ వేడెక్కడం
- ఫ్యూయల్ ఇంజెక్టర్లపై ఇంపాక్ట్ రావడం
అంటే, డెన్సిటీ రేంజ్ నుండి బయటికి వెళ్లినా ఇంజిన్ ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఇకపై పెట్రోల్ బంక్‌లో డెన్సిటీ తప్పనిసరిగా చెక్ చేయండి
ప్రతి అధికారిక పెట్రోల్ పంప్‌లో డెన్సిటీ మీటర్ డిస్ప్లే ఉంటుంది. కస్టమర్ అడిగితే డెన్సిటీ టెస్ట్ కూడా చేసి చూపాలి.
- డెన్సిటీ రేంజ్‌లో ఉంటే ఆ ఫ్యూయల్ స్టాండర్డ్
- రేంజ్‌కి బయట ఉంటే వెంటనే బంక్ మేనేజ్‌మెంట్‌కి చెప్తే మంచిది
ఇది మన ఇంజిన్ లైఫ్‌ను కాపాడడమే కాదు, మనం ఖర్చు పెట్టే ఫ్యూయల్ వృథా కాకుండా చూసుకుంటుంది.
డెన్సిటీ మీటర్‌లో చూపించే నంబర్లు ఏమిని సూచిస్తాయి?
ఫ్యూయల్ క్వాలిటీ BIS స్టాండర్డ్‌లో ఉన్నదో లేదో చూపిస్తాయి.
డెన్సిటీ తప్పుగా ఉంటే ఏం చేయాలి?
పంప్ సిబ్బందిని అడిగి డెన్సిటీ టెస్ట్ చేయించాలి; అవసరమైతే కంప్లైంట్ ఇవ్వాలి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: